Ichchapuram: ఇచ్చాపురంలో ఆకట్టుకుంటున్న ‘దత్తాత్రేయ వినాయకుడు!

Ichchapuram: శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం 22వ వార్డు బలరాంపేటలో కాళీమాత యూత్ ఆధ్వర్యంలో ‘దత్తాత్రేయ వినాయకుడి’ని ప్రతిష్ఠించారు.

Dharmavarapu Saikumar, Ichapuram
Published on: 14 Sept 2026 7:58 PM IST
Ichchapuram
X

Ichchapuram: ఇచ్చాపురంలో ఆకట్టుకుంటున్న ‘దత్తాత్రేయ వినాయకుడు!

ఇచ్ఛాపురం, న్యూస్‌టుడే: ఇచ్ఛాపురం మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు బలరాంపేటలో వినాయక చవితి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బలరాంపేట కాళీమాత యూత్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా ‘శ్రీ దత్తాత్రేయ వినాయకుడి’ ప్రతిమను ప్రతిష్టించారు.

త్రిమూర్తి స్వరూపుడైన దత్తాత్రేయుడి రూపంలో దర్శనమిస్తున్న గణనాథుడిని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపుతున్నారు. తొలిరోజు వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య విగ్రహ ప్రతిష్టాపన, ప్రత్యేక పూజలు, గణపతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం స్వామివారికి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

విశిష్ట రూపంలో కొలువుదీరిన వినాయకుడిని దర్శించుకునేందుకు బలరాంపేటతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా వార్డులో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. రానున్న రోజుల్లో విశేష పూజలు, అన్నదాన కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో స్థానిక పెద్దలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Dharmavarapu Saikumar, Ichapuram

Dharmavarapu Saikumar, Ichapuram