Srikakulam: ఎన్నికల కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌ల పరిశీలన కలెక్టర్ స్వప్నిల్!

Srikakulam: శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ నామినేషన్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లను తనిఖీ చేశారు. ర్యాలీలకు అనుమతి తప్పనిసరి అని స్పష్టం చేశారు.

Dharmavarapu Saikumar, Ichapuram
Published on: 16 Oct 2026 5:10 PM IST
Srikakulam
X

Srikakulam: ఎన్నికల కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌ల పరిశీలన కలెక్టర్ స్వప్నిల్!

శ్రీకాకుళం: మున్సిపల్ ఎన్నికలను ప్రశాంత, పారదర్శక వాతావరణంలో నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని చర్యలు చేపడుతోంది. ఎన్నికల సన్నద్ధతలో భాగంగా శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రంతో పాటు భద్రతాపరమైన స్ట్రాంగ్ రూమ్‌లను ఆయన నిశితంగా పరిశీలించారు.

ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. నామినేషన్ల దాఖలుకు వచ్చే అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కేంద్రాల వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. మొత్తం ప్రక్రియ నిబంధనలకు లోబడి, పూర్తి పారదర్శకంగా సాగాలని స్పష్టం చేశారు.

ర్యాలీల అనుమతికి ప్రత్యేక డెస్క్

ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిర్వహించే ర్యాలీలు, సభలకు ముందస్తు అనుమతి తప్పనిసరి అని కలెక్టర్ స్పష్టం చేశారు. అనుమతుల జారీ కోసం మున్సిపల్ కార్యాలయంలో ప్రత్యేకంగా సింగిల్ విండో డెస్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అభ్యర్థులందరూ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని తు.చ. తప్పకుండా పాటించాలని సూచించారు.

భారీ బందోబస్తుకు సన్నాహాలు

పోలింగ్ రోజున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, ఘర్షణలు తలెత్తకుండా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో అదనపు పోలీస్ బలగాలను మోహరిస్తామని, అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి ఎన్నికలను విజయవంతంగా ముగించాలని పిలుపునిచ్చారు. కలెక్టర్ ఆదేశాలతో మున్సిపల్ యంత్రాంగం ఎన్నికల పనులను మరింత వేగవంతం చేసింది.

Dharmavarapu Saikumar, Ichapuram

Dharmavarapu Saikumar, Ichapuram