Ichchapuram: ఇచ్చాపురం బెల్లుపడ కాలనీలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్
Ichchapuram: శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇచ్చాపురం బెల్లుపడ కాలనీలో పోలీసులు విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు.
Ichchapuram: ఇచ్చాపురం బెల్లుపడ కాలనీలో పోలీసుల కార్డన్ అండ్ సెర్చ్
Ichchapuram: శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఇచ్చాపురం, సోంపేట సర్కిల్ పోలీసులు సంయుక్తంగా శనివారం ఉదయం ఇచ్చాపురం పట్టణంలోని బెల్లుపడ కాలనీలో విస్తృత స్థాయిలో కార్డన్ అండ్ సెర్చ్ నిర్వహించారు. ఇచ్చాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ చిన్నం నాయుడు, సోంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మంగరాజు తమ సిబ్బందితో కలిసి ఇంటింటికీ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సరైన పత్రాలు, యాజమాన్య ఆధారాలు లేని 15 మోటార్సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
వాటికి సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలించిన అనంతరం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు. తనిఖీల అనంతరం బెల్లుపడ కాలనీలోని ప్రజలు, యువతతో పోలీసులు సమావేశమై మాదకద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించారు. డ్రగ్స్కు దూరంగా ఉండాలని, వాటి నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని సూచించారు.
అనంతరం డ్రగ్స్ నిర్మూలనపై ప్రజలు, యువతతో ప్రతిజ్ఞ చేయించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా మాదకద్రవ్యాలకు సంబంధించిన సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ తనిఖీలలో సోంపేట, బారువ, ఇచ్చాపురం రూరల్, కవిటి సబ్ ఇన్స్పెక్టర్లు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




