Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో వర్షాభావం పంటలను కాపాడుకునేందుకు రైతుల అవస్థలు

Srikakulam: శ్రీకాకుళంలో వర్షాలు లేక ఎండిపోతున్న పంటలు. బిందెలతో నీరు మోసుకొచ్చి పంటను తడుపుతున్న వైనం. తోటపల్లి ఆయకట్టు చివరి భూములకు సాగునీరు అందించాలని డిమాండ్.

KAILASH SAHU, PALAKONDA
Published on: 21 July 2026 4:34 PM IST
Srikakulam
X

Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో వర్షాభావం పంటలను కాపాడుకునేందుకు రైతుల అవస్థలు

శ్రీకాకుళం: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో వర్షాలు లేక బావుల్లో, బోర్లలో నీరు తోడి పొలాల్లో పంటను తడిపి కాపాడుకోవాలని రైతులు ప్రయత్నాలు చేస్తున్నారు. జూలై మూడోవారం వచ్చిన సరైన వర్షాలు లేక సాగునీటి కాలువలు ద్వారా నీరు అందే పరిస్థితి లేక వేసిన పంటను కాపాడుకోవడానికి రైతులు పడే ఆవేదన వారణాతీతం.

దాహంతో ఉన్న మనిషికి గుక్కెడు నీరు ఎంతటి ఉపశమనాన్ని ఇస్తుందో గుక్కెడు నీరు వేసి పంటను ఎంతో కొంత కాపాడుకోవాలని రైతులు బిందెలతో నీరు మోసుకొని వచ్చి పంటను తడుపుతున్నారు. సాగునీటి ప్రాజెక్టులు ద్వారా చివర ఆయకట్టు భూములకు నీరు అందే పరిస్థితి లేదు. పాలకొండ నియోజకవర్గంలో రైతులు ప్రధానంగా తోటపల్లి ప్రాజెక్టులు దిగువన ఉన్న సాగునీటి కాలువలుపై ఆధార పడి వ్యవసాయం చేస్తున్నారు.

ఆయకట్టు చివర సెంట్ భూముకు సాగునీరు అందిస్తామని చెప్తున్న ఆచరణలో మాత్రం అది సాధ్యం అవ్వడం లేదు. కూలీలకు రోజుకు 500-700 ఇచ్చి పనులు చేయాల్సిన పరిస్థితి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సాగునీరు అందించాలని చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.

ఒకప్పుడు 2 పంటలు పండే తోటపల్లి ఆయకట్టు భూములు ఇప్పుడు ఒక్క పంట కూడా పండించలేని పరిస్థితిలో ఉందని రైతు సంఘం నాయకులు స్పష్టం చేశారు. జలవనరులు, రెవెన్యూ, వ్యవసాయ శాఖలు సమన్వయం చేసుకొని ఎల్నినో ప్రభావం తో రైతులకు తగిన సూచనలు చేయాలని డిమాండ్ చేశారు.

KAILASH SAHU, PALAKONDA

KAILASH SAHU, PALAKONDA

Next Story