Srikakulam: ఇచ్చాపురంలో అబాకస్, వేదిక్ మ్యాథ్స్ కోర్సుల ప్రారంభం!

Srikakulam: శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో అబాకస్, వేదిక్ మ్యాథ్స్ కోర్సుల పుస్తకాలను ఎంఈఓ కె. సూర్యరావు ఆవిష్కరించారు.

Dharmavarapu Saikumar, Ichapuram
Updated on: 25 Aug 2026 5:15 PM IST
Srikakulam
X

Srikakulam: ఇచ్చాపురంలో అబాకస్, వేదిక్ మ్యాథ్స్ కోర్సుల ప్రారంభం!

శ్రీకాకుళం: అబాకస్,వేదిక్ మ్యాథ్స్ కోర్సుల ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన గౌరవ మండల విద్యాశాఖ అధికారి కె సూర్యరావు కోర్సుల పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... లెక్కల సబ్జెక్టు పట్ల విద్యార్థులు భయాందోళనను విడాలని సూచించారు.

మిగతా పాఠ్యాంశాలకు భిన్నంగా లెక్కల సబ్జెక్ట్ ఉంటుందని... ఈ సబ్జెక్టులో మెలకువలు తెలుసుకుంటే సునాయాసంగా ఎటువంటి లెక్కలు నైనా పరిపూర్ణంగా పూర్తి చేయగలుగుతామని అన్నారు. వేదిక్ మ్యాథ్స్, అబాకస్ లెక్కల పాఠ్యాంశంలో విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని తెలిపారు. వేదిక్ మ్యాథ్స్ లో సూత్రాల ద్వారా ఎంతటి పెద్ద సమస్య అయినా క్షణాల్లో పూర్తి చేయవచ్చునని చెబుతూ .... పలు ఉదాహరణలు విద్యార్థులకు వివరించారు.

ఈ నూతన పద్ధతులను పాఠశాలలో ప్రవేశపెట్టడం అభినందనీయమని పేర్కొన్నారు. పాఠశాల కార్యదర్శి ముఖ్య కార్య నిర్వహణ అధికారి జోహార్ ఖాన్ మాట్లాడుతూ... విద్యార్థుల్లో లెక్కల పాఠ్యాంశం పట్ల మరింత ఆసక్తిని, నైపుణ్యతను పెంపు చేసినందుకు వేదిక్ మాథ్స్, అబాకస్ పాఠ్యాంశాలను ప్రవేశపెడుతున్నామని . భారతదేశ పురాతన వేదాల నుంచి వేదిక్ మ్యాథ్స్ ను స్వామి భారతి కృష్ణ తీర్థజి ప్రపంచానికి అందించారని తెలిపారు.

ఎటువంటి రాత లేకుండా 200 లెక్కలను సైతం ఐదు నిమిషాల్లో పూర్తి చేయగలగా సామర్థ్యాన్ని అబాకస్ నైపుణ్యం అందిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక ట్రస్టీ వజ్రపు రమణమూర్తి, ప్రిన్సిపాల్ ఐబి పండా, ప్రధానోపాధ్యాయురాలు రషీదా సుల్తానా, మేనేజర్ ప్రమోద్ కుమార్, ట్రాన్స్పోర్ట్ మేనేజర్ అలీమ్ ఖాన్, వేదిక్ మాథ్స్ ఉపాధ్యాయురాలు వనజాక్షి, తదితరులు పాల్గొన్నారు.

Dharmavarapu Saikumar, Ichapuram

Dharmavarapu Saikumar, Ichapuram

Next Story