Kanchili: భారీ వర్షాలకు బూరగాంలో మూడు ఇళ్లు కూలివేత!

Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగాంలో భారీ వర్షాలకు మూడు ఇళ్లు కూలివేత: తీవ్ర ఇబ్బందుల్లో బాధిత కుటుంబాలు, సహాయం అందించాలని ఏఈని కోరిన టీడీపీ నేత మాదిన రామారావు.

G.RAMBABU, SOMPET
Published on: 24 Sept 2026 4:16 PM IST
Kanchili
X

Kanchili: భారీ వర్షాలకు బూరగాంలో మూడు ఇళ్లు కూలివేత!

కంచిలి: కంచిలి మండలంలో కురుస్తున్న భారీ వర్షాలకు బూరగాం గ్రామంలో మూడు ఇళ్లు కూలిపోయాయి. దీంతో బాధిత కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గ్రామంలో నెలకొన్న పరిస్థితిని స్థానిక కూటమి నాయకుల ద్వారా తెలుసుకున్న కంచిలి మండల టీడీపీ అధ్యక్షుడు మాదిన రామారావు వెంటనే స్పందించారు.

ఇళ్లు కూలిపోయిన విషయాన్ని మండల గృహ నిర్మాణ శాఖ సహాయ ఇంజినీర్‌ దృష్టికి తీసుకెళ్లి, బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేలా చర్యలు చేపట్టాలని కోరారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET