Srikakulam: నిమ్మాడలో కుటుంబ సభ్యులతో వినాయక పూజల్లో మంత్రి అచ్చెన్నాయుడు!
Srikakulam: స్వగ్రామం నిమ్మాడలో వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్న మంత్రి అచ్చెన్నాయుడు. రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు.
Srikakulam: నిమ్మాడలో కుటుంబ సభ్యులతో వినాయక పూజల్లో మంత్రి అచ్చెన్నాయుడు!
Srikakulam: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తన స్వగ్రామం నిమ్మాడలో కుటుంబ సభ్యులతో కలిసి భక్తిశ్రద్ధలతో వినాయక చవితి వేడుకల్లో పాల్గొన్నారు. విఘ్నేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు అందరిపై ఉండాలని ప్రార్థించారు.
విఘ్నాలను తొలగించి విజయాలను ప్రసాదించే గణనాథుడి కృపాకటాక్షాలతో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, ఆనందంగా, ప్రశాంతంగా జీవించాలని ప్రార్థించారు.
గణనాథుడిని భక్తిశ్రద్ధలతో పూజించడం ఎంతో గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని కలిగించింది. గణపతి జ్ఞానం, వివేకం, విజయానికి ప్రతీక. ఏ శుభకార్యాన్నైనా విఘ్నేశ్వరుడి పూజతో ప్రారంభించడం మన సంస్కృతి, సంప్రదాయంలో భాగం. విఘ్నాలను తొలగించి, సన్మార్గాన్ని చూపే గణనాథుడి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షిస్తున్నాను. వినాయక చవితి వేడుకలు ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, శ్రేయస్సును నింపాలని గణనాథుని ప్రార్ధించారు.
రాష్ట్రం సుభిక్షంగా, సస్యశ్యామలంగా వర్ధిల్లాలని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఎదురయ్యే అన్ని విఘ్నాలు తొలగిపోయి ప్రగతి పథంలో మరింత వేగంగా ముందుకు సాగాలని గణనాథుడిని ప్రార్థించినట్లు మంత్రి తెలిపారు. రైతులు, వ్యవసాయ కూలీలు సహా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలని ఆకాంక్షించిన మంత్రి
ఈ వేడుకల్లో పిఎసిఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్ గారు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్. ఓ ఎస్ డి కింజరాపు ప్రభాకర్ గారు, గ్రామ ప్రజలు , వినాయక ఉత్సవ కమిటీ సభ్యులు, యువకులు పాల్గొన్నారు.




