Srikakulam: మహిళలకు అండగా వన్ స్టాప్ సెంటర్: ఎమ్మెల్యే గొండు శంకర్

Srikakulam: శ్రీకాకుళం రిమ్స్‌లో సఖీ వన్ స్టాప్ సెంటర్ నూతన భవనాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్ ప్రారంభించారు. బాధిత మహిళలు నిర్భయంగా ఆశ్రయించాలని సూచించారు.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 22 Sept 2026 5:03 PM IST
Srikakulam
X

Srikakulam: మహిళలకు అండగా వన్ స్టాప్ సెంటర్: ఎమ్మెల్యే గొండు శంకర్

శ్రీకాకుళం: హింస గురైన మహిళలకు ఒన్ స్టాప్ సెంటర్ అండగా ఉంటుందని శాసన సభ్యులు గొండు శంకర్ వెల్లడించారు. ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో సఖి వన్ స్టాప్ సెంటర్ నూతన భవనాన్ని మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ పి. శోభారాణితో కలసి ఆయన మంగళవారం ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ రకాల హింసకు గురైన మహిళలకు వన్ స్టాప్ సెంటర్ (OSC) ద్వారా ఒకే చోట సమగ్ర సహాయం, సేవలు అందించబడతాయన్నారు.

శారీరక, లైంగిక, మానసిక, భావోద్వేగ, ఆర్థిక వేధింపులు, గృహ హింస, లైంగిక దాడులు, అక్రమ రవాణా, యాసిడ్ దాడులు, తదితర బాధితులకు అవసరమైన వైద్య, న్యాయ కౌన్సెలింగ్, మానసిక సహాయం అందుతున్నట్లు తెలిపారు.

కులం, మతం, వర్గం, ప్రాంతం, వైవాహిక స్థితితో సంబంధం లేకుండా బాధిత మహిళలకు సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. 18 సంవత్సరాల లోపు బాలికలకు POCSO, తదితర సంబంధిత చట్టాల ప్రకారం అవసరమైన రక్షణ, సహాయ సేవలతో అనుసంధానం చేస్తారన్నారు. హింసకు గురైన మహిళలు భయపడకుండా వన్ స్టాప్ సెంటర్‌ను సంప్రదించి సహాయం పొందాలని ఆయన సూచించారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.