Palasa: టిడ్కో బాధితుల కన్నీరు.. ఇల్లు ఇవ్వకుండా డబ్బులు వాపసా?

Palasa: శ్రీకాకుళం జిల్లా పలాసలో టిడ్కో ఇల్లు అందని 1149 మంది బాధితులు మున్సిపల్ ఆఫీస్ వద్ద క్యూ కట్టారు.

B LOKANADHAM, PALASA
Published on: 5 Jun 2026 8:40 PM IST
Palasa
X

Palasa: టిడ్కో బాధితుల కన్నీరు.. ఇల్లు ఇవ్వకుండా డబ్బులు వాపసా?

Palasa: 2016 లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దిగువ,మధ్య తరగతి కుటుంబాల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా టిడ్కో గృహసముదాయాల నిర్మాణాలు చేపట్టి లబ్ధిదారుల నుండి దరఖాస్తులు కోరిన నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పలాస లో 2016-18 కాలంలో సుమారు 2061 మంది దరఖాస్తు చేసుకుని 300 ఎస్.ఎఫ్.టి ,365 యెస్.ఎఫ్.టి,430 యెస్.ఎఫ్.టి ఇళ్ల కొరకు కొంత డబ్బును డి.డి.ల రూపంలో చెల్లించగా,

కేవలం 912 ఇల్లు మాత్రమే నిర్మాణం జరగడంతో ఇల్లు అందని 1149 మందికి వారు డిడి ల రూపంలో చెల్లించిన మొత్తాన్ని అధికారులు వాపసు చేస్తున్నట్లు ప్రకటించిన నేపధ్యంలో దరఖాస్తుదారులు వారికిచ్చిన రసీదులను మునిసిపల్ కార్యాలయంలో సంబంధిత అధికారులకు అందజేయాలని,అందజేసిన ఒక వారం రోజుల్లో వారి డబ్బు వారి అకౌంట్ లో జమ అవుతుందనడంతో,వారంతా రసీదులను మునిసిపల్ కార్యాలయంలో జమ చేసేందుకు క్యూ కడుతున్నారు.

అయితే రసీదులు జమచేసినట్లు తమకు ఎటువంటి ఆధారాలు ఇవ్వడం లేదని,రేపు ఏదన్నా జరగరానిది జరిగితే తమ వద్ద ఆధారాలేవని,అప్పులు చేసి కట్టామని,ఇప్పటికీ వడ్డీలు కడుతున్నామని వాపోతున్నారు. సుమారు 7 సంవత్సరాలు తరువాత తాము కట్టిన డబ్బును వాపసు చేయడం ఎంతవరకు సమంజసమని, బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదే విషయమై పలాస కాశీబుగ్గ మునిసిపాలిటీ టిడిపి కిచెందిన సీనియర్ నాయకుడు,కౌన్సిలర్ దువ్వాడ శ్రీకాంత్ బాధితులకు న్యాయం జరిగేలా చూడాలని మునిసిపల్ కమీషనర్ ఇ. శ్రీనివాస్ కు రిప్రజెంటేషన్ ను అందజేశారు.

B LOKANADHAM, PALASA

B LOKANADHAM, PALASA

Next Story