Srikakulam: పలాస డివిజన్‌లో తొలిరోజు 491 నామినేషన్లు దాఖలు!

Srikakulam: శ్రీకాకుళం జిల్లా పలాస రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఏడు మండలాల్లో తొలిరోజు ఆదివారం సర్పంచ్‌ స్థానాలకు 168, వార్డులకు 323 కలిపి మొత్తం 491 నామినేషన్లు దాఖలయ్యాయి.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 16 Nov 2026 10:40 AM IST
Srikakulam
X

Srikakulam: పలాస డివిజన్‌లో తొలిరోజు 491 నామినేషన్లు దాఖలు!

శ్రీకాకుళం: రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని ఏడు మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియలో భాగంగా తొలిరోజు ఆదివారం డివిజన్‌ వ్యాప్తంగా సర్పంచ్‌ స్థానాలకు 168, వార్డు సభ్యుల స్థానాలకు 323 చొప్పున మొత్తం 491 నామినేషన్‌ పత్రాలు దాఖలైనట్లు జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ ఒక ప్రకటనలో తెలిపారు. క్షేత్రస్థాయిలో రిటర్నింగ్‌ అధికారులు, సహాయ ఎన్నికల అధికారులు నిబంధనల మేరకు నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు వివరించారు.

మండలాల వారీగా తొలిరోజు ఇచ్ఛాపురంలో సర్పంచ్‌ పదవులకు 31, వార్డు సభ్యులకు 60, కంచిలిలో సర్పంచ్‌లకు 18, వార్డులకు 29, కవిటిలో సర్పంచ్‌లకు 24, వార్డులకు 15 నామినేషన్లు దాఖలయ్యాయని కలెక్టర్‌ తెలిపారు. అలాగే మందసలో సర్పంచ్‌లకు 35, వార్డులకు 78, పలాసలో సర్పంచ్‌లకు 10, వార్డులకు 27, సోంపేటలో సర్పంచ్‌లకు 21, వార్డులకు 48, వజ్రపుకొత్తూరులో సర్పంచ్‌ స్థానాలకు 29, వార్డు సభ్యుల స్థానాలకు 66 నామినేషన్లు అందినట్లు వెల్లడించారు. అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో నామినేషన్లు దాఖలు చేయాలని సూచించారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.