Amadalavalasa: ఫ్రెండ్లీ పోలీసింగే లక్ష్యం ఆమదాలవలసలో 'పల్లె నిద్ర'!

Amadalavalasa: శ్రీకాకుళం జిల్లా ఎస్పీ ఆదేశాలతో ఆమదాలవలస నియోజకవర్గంలో పల్లె నిద్ర. బొబ్బిలిపేట, చీమలవలస, కొర్లకోట గ్రామాల్లో పర్యటించిన పోలీసు అధికారులు.

P.RAMMOHAN, AMADALAVALASA
Published on: 1 Sept 2026 7:49 AM IST
Amadalavalasa
X

Amadalavalasa: ఫ్రెండ్లీ పోలీసింగే లక్ష్యం ఆమదాలవలసలో 'పల్లె నిద్ర'!

Amadalavalasa: శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కెవి మహేశ్వర్ రెడ్డి ఆదేశాల మేరకు ఆమదాలవలస నియోజకవర్గం బొబ్బిలి పేట గ్రామంలో డిఎస్పి వివేకానంద పల్లె నిద్ర' కార్యక్రమం చేపట్టారు. ప్రజలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పల్లె నిద్ర కార్యక్రమంతో ప్రజలకు పోలీసు వ్యవస్థపై నమ్మకాన్ని కలిగిస్తున్నామన్నారు.

నేరాల నియంత్రణ, ప్రజల సహకారంతో పోలీసింగ్ ను మరింత బలోపేతం చేయడమే పల్లె నిద్ర ప్రధాన లక్ష్యమని అన్నారు. గ్రామాల్లో చిన్న చిన్న గొడవలు పెద్ద నేరాలుగాను, శాంతిభద్రతల సమస్యగా మారే అవకాశముందని, ఇలాంటి అంశాలను క్షేత్ర స్థాయిలో గుర్తించి, చర్యలు చేపడుతున్నామన్నారు.

పోలీసు స్టేషన్లుకు వెళ్ళకుండానే వారి సమస్యలను నేరుగా పోలీసు అధికారులకు తెలిపేందుకు 'పల్లెనిద్ర' ఒక వేదికగా నిలుస్తుందన్నారు.

క్షేత్ర స్థాయిలో ప్రజలతో మమేకమై, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే విషయాలను, గ్రామంలో వివిధ రాజకీయ పార్టీల మధ్యగల విభేదాలను, భూతగాదాలను క్షేత్ర స్థాయిలో గుర్తించి, శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా చూసేందుకు, ప్రజలకు రక్షణగా నిలిచే చట్టాలు, సైబరు మోసాలు, మహిళలు, రహదారి భద్రతపట్ల అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని వారు తెలిపారు.

అలాగే చీమలవలస గ్రామం:

క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలను తెలుసుకోవడానికే పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టినట్లు ఆమదాలవలస సీఐ సన్యాసి నాయుడు నాయుడు అన్నారు. సోమవారం రాత్రి చీమలవలస గ్రామంలో ఆయన పర్యటించారు. ఆయన మాట్లాడుతూ పల్లెనిద్ర' కార్యక్రమం అనేది ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యలను తెలుసుకునే లక్ష్యంతో అధికారులు చేపడుతున్న ఒక కార్యక్రమం.

ఈ కార్యక్రమంలో భాగంగా పోలీస్ అధికారులు గ్రామాలలో పర్యటించి, గ్రామస్థులతో సమావేశాలు నిర్వహిస్తారు. అలాగే గ్రామాల్లో రాత్రి బస చేసిన సీఐ స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. గ్రామాల్లో శాంతిభద్రతల పరిస్థితి, అసాంఘిక కార్యకలాపాలు, మద్యం, గంజాయి తదితర అంశాలపై ఆరా తీశారు. ప్రజలు ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో తెలుసుకుని, వాటిపై పోలీసుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.

కొర్లకోట గ్రామం:

ఆమదాలవలస ఎస్సై బాలరాజు కొర్లకోట గ్రామంలో సోమవారం రాత్రి పల్లె నిద్ర కార్యక్రమం గ్రామ పెద్దలు, యువతతో సమావేశం నిర్వహించారు . ఆయన మాట్లాడుతూ గంజాయి, మత్తు పదార్థాల వినియోగం, రవాణా, అమ్మకం చట్టరీత్యా నేరమని, వీటిని అరికట్టడంలో గ్రామస్తుల సహకారం అందించాలని కోరారు. మత్తు పదార్థాల వల్ల కలిగే దుష్పరిణామాలను వివరించారు.

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని కోరారు. మద్యం సేవించి వాహనాలు నడపడం చట్టరీత్యా నేరమని, అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. విలువైన బంగారు ఆభరణాలు, నగదు విషయంలో జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

P.RAMMOHAN, AMADALAVALASA

P.RAMMOHAN, AMADALAVALASA

Next Story