దాతల కోసం ఎదురుచూపులు.. చిన్నారి గీతిక ప్రాణాల కోసం తల్లిదండ్రుల ఆవేదన!

Srikakulam: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన ఆరేళ్ల చిన్నారి గీతిక గుండె సంబంధిత వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉంది.

SRIDHAR, RAJAM
Published on: 27 May 2026 8:30 PM IST
Srikakulam
X

దాతల కోసం ఎదురుచూపులు.. చిన్నారి గీతిక ప్రాణాల కోసం తల్లిదండ్రుల ఆవేదన!

Srikakulam: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో ఓ చిన్నారి ప్రాణాల కోసం కుటుంబం సహాయం కోరుతోంది. రాజాం పట్టణంలోని చిక్కాల వీధికి చెందిన శ్రీదేవి–సత్యనారాయణ దంపతుల ఆరేళ్ల కుమార్తె గీతిక గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతిలోని ఆసుపత్రిని సంప్రదించగా, శస్త్రచికిత్సకు కనీసం రూ.2 లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. అయితే కుటుంబ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉండటంతో ఆ మొత్తాన్ని సమకూర్చలేక తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

గీతిక తండ్రి డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వచ్చే స్వల్ప ఆదాయంతో కుటుంబ పోషణే కష్టంగా మారిందని, ఇలాంటి పరిస్థితుల్లో కుమార్తెకు ఆపరేషన్ ఎలా చేయించాలో అర్థం కావడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. గీతికకు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. “దాతలు ఎవరైనా ముందుకు వచ్చి సహాయం చేస్తే మా బిడ్డ ప్రాణాలు కాపాడుకోవచ్చు” అంటూ గీతిక తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. సహాయం చేసే మనసున్న వారు స్పందించి చిన్నారి జీవితంలో వెలుగు నింపాలని స్థానికులు కోరుతున్నారు.

SRIDHAR, RAJAM

SRIDHAR, RAJAM

Next Story