Rajam: సెప్టిక్ ట్యాంక్ వివాదంలో తమ్ముడి చేతిలో అన్న మృతి!

Rajam: శ్రీకాకుళం జిల్లా కొండంపేటలో సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వివాదం అన్నదమ్ముల ఘర్షణకు దారితీసింది. తమ్ముడితో పెనుగులాటలో కిందపడి అన్న శంకరరావు మృతి చెందాడు.

SRIDHAR, RAJAM
Published on: 7 July 2026 1:38 PM IST
Rajam
X

Rajam: సెప్టిక్ ట్యాంక్ వివాదంలో తమ్ముడి చేతిలో అన్న మృతి!

రాజాం: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాం మండలం కొండంపేట గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ విషయంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు పలిశెట్టి మహేష్, శంకరరావు మధ్య ఘర్షణ జరిగింది.

పెనుగులాటలో శంకరరావు కిందపడడంతో తలకు తీవ్ర గాయమైందని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంటనే ఆయనను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తుండగా, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ఘటనపై దర్యాప్తు చేపట్టారు.

SRIDHAR, RAJAM

SRIDHAR, RAJAM

Next Story