Srikakulam: శ్రీకాకుళం: నేడు రెవెన్యూ క్లినిక్ రద్దు.. పీజీఆర్‌ఎస్ యథాతథం

Srikakulam: శ్రీకాకుళంలో నేడు రెవెన్యూ క్లినిక్ రద్దయిందని, జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) యథాతథంగా జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 11 Oct 2026 5:54 PM IST
Srikakulam
X

Srikakulam: శ్రీకాకుళం: నేడు రెవెన్యూ క్లినిక్ రద్దు.. పీజీఆర్‌ఎస్ యథాతథం

శ్రీకాకుళం: నేడు (సోమవారం,12.10.2026) రెవెన్యూ క్లినిక్ రద్దు చేస్తున్నట్లు,ప్రజా ఫిర్యాదుల నమోదు పరిష్కార వేదిక కార్యక్రమము యధాతధంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించ బడుతుందని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఓ ప్రకటన విడుదల చేస్తూ పీజీఆర్ఎస్ కు సంబంధించిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయాలని దానివలన మరింత మెరుగైన సేవలు పొందగలుగుతారని పేర్కొన్నారు.

అర్జీదారులు వారి యొక్క అర్జీలు నేరుగా పై కార్యక్రమములో లేదా ఆన్లైన్ లో Meekosam.ap.gov.in (మీకోసం డాట్ ఏపీ డాట్ జివో వి డాట్ ఇన్) వెబ్సైట్ లో అర్జీలు నమోదు చేసుకోవచ్చునని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

అర్జీ దారుల అర్జీల నమోదు, నమోదైన అర్జీల గురించి వాటి యొక్క స్థితి దానికి సంబంధించి సమాచారం గూర్చి తెలుసుకోవాలంటే 1100 (డబల్ వన్ డబల్ జీరో)కి నేరుగా కాల్ చేయవచ్చని వివరించారు. అర్జీదారులు గమనించి నేడు నిర్వహించే ప్రజా ఫిర్యాదుల నమోదు, పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.