Srikakulam: శ్రీకాకుళం సీనియర్ ఫోటోగ్రాఫర్లకు ఘన సత్కారం
Srikakulam: న్నై ట్రేడ్ సెంటర్‌లో నిర్వహించిన ‘ఇమేజ్ టుడే’ అంతర్జాతీయ ఎగ్జిబిషన్‌లో శ్రీకాకుళం కవిటి, మందస మండలాలకు చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్లుకు ఘన సత్కారం.
Srikakulam: శ్రీకాకుళం సీనియర్ ఫోటోగ్రాఫర్లకు ఘన సత్కారం
Srikakulam: కవిటి కెమెరాను వృత్తిగా మాత్రమే కాకుండా జీవితంగా భావించి దశాబ్దాలుగా వేలాది కుటుంబాల మధుర జ్ఞాపకాలను చిత్రాల్లో బంధిస్తూ ఫోటోగ్రఫీ రంగానికి విశిష్ట సేవలు అందిస్తున్న కవిటి, మందస మండలాలకు చెందిన ఇద్దరు సీనియర్ ఫోటోగ్రాఫర్లకు చెన్నై వేదికపై అరుదైన గౌరవం లభించింది. చెన్నై ట్రేడ్ సెంటర్లో బై సెల్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇమేజ్ టుడే ఫోటో, వీడియో అండ్ సినీమాటిక్ బ్రాడ్కాస్ట్ ఎగ్జిబిషన్ సందర్భంగా సీనియర్ ఫోటోగ్రాఫర్లు శమళ్ల కేశవరావు, దున్న సోమేశ్వరరావులను ఘనంగా సన్మానించారు.
ఆంధ్రప్రదేశ్ - ఫొటోగ్రఫీ అభివృద్ధి సంఘం వ్యవస్థాపకులు జి. శివాజీ, సంఘం అధ్యక్షులు సూర్య సుబ్బారావు, చెన్నై ఫోటోగ్రఫీ అసోసియేషన్ ప్రతినిధులు కలిసి శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ప్రతి ఏడాది సుదూర ప్రయాణం చేసి ఫోటో ఎక్స్ పోలో పాల్గొంటూ, కొత్త సాంకేతికతను నేర్చుకుని యువ ఫోటోగ్రాఫర్లకు మార్గదర్శకులుగా నిలుస్తున్న వారి సేవలను గుర్తించి ఈ గౌరవం అందించినట్లు జి. శివాజీ తెలిపారు.
ఈ సత్కారంతో శ్రీకాకుళం జిల్లా ఫోటోగ్రఫీ రంగానికి గుర్తింపు లభించిందని సహచర ఫోటోగ్రాఫర్లు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో దూగాన శ్యాంబాబు, కోళ్ళ పురుషోత్తం, పుచ్చ దేవరాజు, మాదిన రవి, పొందల ప్ర సాద్బాబు,శమళ్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.




