Kanchili: కంచిలి గ్రామ పంచాయతీలో టీడీపీ అభ్యర్థి కురయ్య ఇంటింటి ప్రచారం!
Kanchili: శ్రీకాకుళం జిల్లా సోంపేట నియోజకవర్గం కంచిలి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా టీడీపీ సర్పంచ్ అభ్యర్థి కురయ్య శనివారం ఇంటింటికీ తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
Kanchili: కంచిలి గ్రామ పంచాయతీలో టీడీపీ అభ్యర్థి కురయ్య ఇంటింటి ప్రచారం!
కంచిలి: కంచిలి గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి కురయ్య ఇంటింటి ప్రచారం నిర్వహించారు. శనివారం కంచిలి పంచాయితీ గ్రామంలో పర్యటిస్తూ ఓటర్లను ఆప్యాయంగా పలకరించారు. గ్రామస్థులతో మమేకమై తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.
ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల మద్దతుతో గ్రామ సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో టీడీపీ నాయకులు మద్దిల భాస్కరరావు, పట్టాయిక్ మరళి, పార్టీ కార్యకర్తలు, కురయ్య అభిమానులు, గ్రామస్థులు పాల్గొన్నారు.




