Kanchili: పెద్ద ఖోజ్జిరియా గ్రామంలో ఘనంగా విజయోత్సవ కార్యక్రమం!
Kanchili: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్ద ఖోజ్జిరియా గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన నూతన సర్పంచ్ బొడ్డ సంధ్యారాణి ఇంటింటికీ వెళ్లి గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.
Kanchili: పెద్ద ఖోజ్జిరియా గ్రామంలో ఘనంగా విజయోత్సవ కార్యక్రమం!
కంచిలి: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం పెద్ద ఖోజ్జిరియా గ్రామంలో పంచాయతీ ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా విజయోత్సవ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహించారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్ బొడ్డ సంధ్యారాణి (వైఫ్ ఆఫ్ బొడ్డ రామ్ కుమార్), కూటమి నాయకులు, కార్యకర్తలు గ్రామంలో భారీ స్థాయిలో ఇంటింటికీ వెళ్లి తమకు ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటిని సందర్శిస్తూ ఓటర్లను ఆప్యాయంగా పలకరించి, ఎన్నికల్లో తమపై నమ్మకం ఉంచి ఆశీర్వదించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. ఎన్నికల సమయంలో తమకు అండగా నిలిచిన ప్రతి కార్యకర్తకు, గ్రామ పెద్దలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. "గ్రామ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, ప్రజల ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తామని" సర్పంచ్ సంధ్యారాణి తెలిపారు.
గ్రామంలో మౌలిక సదుపాయాల కల్పన, పారిశుధ్యం, తాగునీటి సమస్యల పరిష్కారం, రోడ్లు, వీధి దీపాలు వంటి అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తామని ఆమె హామీ ఇచ్చారు. ప్రజలందరినీ కలుపుకుని, పార్టీలకతీతంగా గ్రామ అభివృద్ధి కోసం పనిచేస్తామని, ప్రతి ఒక్కరి సమస్యను స్వయంగా తెలుసుకుని పరిష్కరిస్తామని ఆమె స్పష్టం చేశారు.
విజయోత్సవ కార్యక్రమంలో బొడ్డ హరిబాబు, బొడ్డ కవి బాబు, బొడ్డ విజయ్ కుమార్, సీతారామమూర్తి, బాలక నారాయణమూర్తి, బాలక శశిబోసర్ రావు కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. గ్రామమంతా పండగ వాతావరణం నెలకొంది.




