Srikakulam: శ్రీకాకుళంలో పోలీసులకు ఉచిత మెగా వైద్య శిబిరం!

Srikakulam: శ్రీకాకుళంలో పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యుల కోసం నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర రెడ్డి ప్రారంభించారు.

Varaprasad, Staff Reporter -Srikakulam
Published on: 7 Oct 2026 4:25 PM IST
Srikakulam
X

Srikakulam: శ్రీకాకుళంలో పోలీసులకు ఉచిత మెగా వైద్య శిబిరం!

Srikakulam: శ్రీకాకుళం జిల్లా పోలీసులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి, ముఖ్య అతిథిగా హాజరై హెల్త్ క్యాంప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, కిమ్స్ హాస్పిటల్ ప్రతినిధులు జిల్లా ఎస్పీకి ఘన స్వాగతం పలికారు.ఈ హెల్త్ క్యాంప్‌లో సుమారు 200 మంది పోలీసు అధికారులు ,సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. వారికి ECG, 2D ఎకో, ఆడియోమెట్రీ, ర్యాండమ్ బ్లడ్ షుగర్ (RBS), కంటి పరీక్షలు, దంత పరీక్షలు, రక్తపోటు (BP), బ్లడ్ షుగర్ తదితర వివిధ నివారణాత్మక ఆరోగ్య పరీక్షలను ఉచితంగా నిర్వహించి, అవసరమైన వైద్య సలహాలు అందించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. సమాజ భద్రత కోసం నిరంతరం విధులు నిర్వహిస్తున్న పోలీసు సిబ్బంది ఆరోగ్యం, సంక్షేమానికి జిల్లా పోలీసు శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడి, పని భారం నేపథ్యంలో పోలీసు సిబ్బంది తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ముందస్తు ఆరోగ్య పరీక్షల ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను ప్రారంభ దశలోనే గుర్తించి, సకాలంలో వైద్య చికిత్స పొందే అవకాశం ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు.

పోలీసు సిబ్బందితో పాటు వారి కుటుంబ సభ్యులకు ఇటువంటి ఆరోగ్య శిబిరాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు.అనుకోని వైద్య పరిస్థితుల్లో కుటుంబాలపై ఆర్థిక భారం తగ్గించడంలో ఆరోగ్య బీమా కూడా కీలక పాత్ర పోషిస్తుందని, ఆరోగ్య సంరక్షణతో పాటు భవిష్యత్ వైద్య అవసరాలకు ఆర్థికంగా సిద్ధంగా ఉండేలా అవగాహన కల్పించడం ఇటువంటి కార్యక్రమాల ప్రధాన ఉద్దేశ్యమని తెలిపారు.పోలీసు సిబ్బంది ఆరోగ్యంగా, మానసికంగా ఉత్సాహంగా ఉంటేనే ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించగలరని, వారి సంక్షేమం కోసం జిల్లా పోలీసు శాఖ నిరంతరం కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.

Varaprasad, Staff Reporter -Srikakulam

Varaprasad, Staff Reporter -Srikakulam

మూడు దశాబ్దాలకు పైగా (36 ఏళ్లు) సుదీర్ఘ అనుభవంతో, శ్రీకాకుళం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై అపారమైన పట్టున్న ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.