Srikakulam: మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: ప్రిన్సిపాల్ సింహాచలం నాయుడు
Srikakulam: శ్రీకాకుళం కవిటి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈగల్ క్లబ్ ఆధ్వర్యంలో డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమం నిర్వహించి, విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.
Srikakulam: మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలి: ప్రిన్సిపాల్ సింహాచలం నాయుడు
Srikakulam: కవిటి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈగల్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రభుత్వం పంపిణీ చేసిన డ్రగ్స్ వాడకం వల్ల కలిగే అనర్ధాలను తెలియజేస్తూ ప్రచురించిన పుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ కే. సింహాచలం నాయుడు మాట్లాడుతూ ముఖ్యంగా యువత డ్రగ్స్ కు దూరంగా ఉండటంతో పాటు కుటుంబ సభ్యులను, గ్రామంలోని ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని కోరారు.
డ్రగ్స్ కు సంబంధించిన సమాచారం లభిస్తే వెంటనే 1972కు సమాచారం ఇవ్వాలని సూచించారు. అనంతరం విద్యార్థులు, అధ్యాపకులు డ్రగ్స్ వద్దు బ్రో అంటూ ప్రతిజ్ఞ చేసి, అనంతరం నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఈగల్ క్లబ్ సమన్వయ కర్త బి. శ్రీనుబాబు, సహ సమన్వయ కర్త జి. విష్ణు మూర్తి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు




