Kaviti: కవిటిలో రూ.65,100కు వినాయకుడి లడ్డూ సొంతం!
Kaviti: శ్రీకాకుళం జిల్లా కవిటిలో రాజా యూత్ ఆధ్వర్యంలో ఘనంగా వినాయక లడ్డూ వేలం.. రూ.65,100కు లడ్డూను దక్కించుకున్న మాజీ ఆర్మీ ఉద్యోగి కామరాజు దంపతులు.
Kaviti: కవిటిలో రూ.65,100కు వినాయకుడి లడ్డూ సొంతం!
Kaviti: వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా కవిటి మండల కేంద్రమైన కవిటి పెద్ద వీధిలో రాజా యూత్ ఆధ్వర్యంలో నిర్వహించిన వినాయకుని లడ్డూ వేలం పాట భక్తి శ్రద్ధలతో, ఉత్సాహభరితంగా సాగింది. గత కొన్నేళ్లుగా పెద్ద వీధిలో రాజా యూత్ సభ్యులు వినాయక మండపాన్ని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఈ ఏడాది కూడా ఘనంగా ఉత్సవాలు నిర్వహించారు. ఉత్సవాల్లో చివరి రోజు నిర్వహించే లడ్డూ వేలం కార్యక్రమానికి భక్తుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ వేలం పాటలో పలువురు భక్తులు పోటీపడగా చివరకు లడ్డూను రూ.65,100కు మాజీ ఆర్మీ ఉద్యోగి కామరాజు కవి దంపతులు కైవసం చేసుకున్నారు. లడ్డూను దక్కించుకోవడం అదృష్టంగా భావిస్తున్నామని, స్వామి వారి కృపతోనే లడ్డూ తమకు లభించిందని వారు తెలిపారు. అనంతరం నిర్వాహకులు లడ్డూను వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో రాజా యూత్ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




