Narasannapeta: బీజేపీలోకి వైఎస్ఆర్సీపీ నేతల చేరిక కండువా కప్పిన సింహాచలం
Narasannapeta: నరసన్నపేటలో బీజేపీ ఇంచార్జ్ పోకతోట సింహాచలం ఆధ్వర్యంలో పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.
Narasannapeta: బీజేపీలోకి వైఎస్ఆర్సీపీ నేతల చేరిక కండువా కప్పిన సింహాచలం
నరసన్నపేట: నరసన్నపేట నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి ప్రజాదరణ పెరుగుతోంది. బీజేపీ సిద్ధాంతాలు, ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం, కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు వైసీపీ నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు.
నరసన్నపేట నియోజకవర్గ బీజేపీ పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో కొత్తరేవు పంచాయతీ అజ్జాల అచ్యుతరావు గారు, నరసన్నపేటకు చెందిన సురేష్ గారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నరసన్నపేట నియోజకవర్గ ఇంచార్జ్ (BLA-1) శ్రీ పోకతోట సింహాచలం గారి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకుని పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా పోకతోట సింహాచలం గారు నూతనంగా పార్టీలో చేరిన నాయకులకు సాదర స్వాగతం పలికి, పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ అంకితభావంతో పనిచేయాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారం, అభివృద్ధి, సుపరిపాలనే బీజేపీ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
నరసన్నపేట నియోజకవర్గంలో బీజేపీకి పెరుగుతున్న ఆదరణకు ఈ చేరికలు నిదర్శనమని, రానున్న రోజుల్లో మరింత మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని పోకతోట సింహాచలం గారు పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని, ఆ అభివృద్ధి ఫలాలు ప్రతి కుటుంబానికి చేరేలా బీజేపీ కార్యకర్తలు ప్రజలతో మమేకమై పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నరసన్నపేట మండల ఇంచార్జ్ కె.రామారావు, పోలాకి పూర్వ మండల అధ్యక్షులు ఎస్ కృష్ణారావు, నాయకులు,D దానయ్య, దామోదర్ , రామారావు కార్యకర్తలు పాల్గొని నూతనంగా పార్టీలో చేరిన వారికి అభినందనలు తెలిపారు.




