Srikakulam: శ్రీకాకుళం జిల్లా రాజాంలో కలకలం రేపిన ఘటన!
Srikakulam: శ్రీకాకుళం జిల్లా రాజాంలో మానవ తప్పిదానికి ఓ మూగజీవి బలైన విషాద ఘటన చోటుచేసుకుంది. రోడ్లపై పశువులను వదిలేస్తున్న యజమానుల నిర్లక్ష్యంపై స్థానికులు.
Srikakulam: శ్రీకాకుళం జిల్లా రాజాంలో కలకలం రేపిన ఘటన!
Srikakulam: పశువులను రోడ్లపైనే పాలు పితికి, ఆ తర్వాత వాటికి తగిన మేత, సంరక్షణ కల్పించకుండా రోడ్లపై వదిలేస్తున్నారనే ఆరోపణలు స్థానికంగా వినిపిస్తున్నాయి. దీంతో రోడ్లపై సంచరిస్తున్న పశువులు ప్రమాదాలకు గురవుతున్నాయి.
పశువుల యజమానులు తమ బాధ్యతను విస్మరించడంతో మూగజీవాల ప్రాణాలకు ముప్పు ఏర్పడుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో రోడ్లపై సంచరిస్తున్న పశువులపై మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుని వాటిని గోశాలలకు తరలించినప్పటికీ, పశువుల యజమానుల తీరు మారలేదని స్థానికులు అంటున్నారు.
ఇదిలా ఉండగా... రోడ్లపై సంచరిస్తున్న పశువుల విషయమై గురువారం స్థానిక సీఐ, మున్సిపల్ కమిషనర్‌తో కలిసి పరిశీలించి, పశువుల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినట్లు సమాచారం.
అయితే హెచ్చరికలు చేసిన మరుసటి రోజే మూగజీవి ప్రాణాలు కోల్పోవడం బాధాకరంగా మారింది.ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని, పశువుల యజమానులు తమ పశువులను రోడ్లపైకి వదలకుండా తగిన సంరక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.
మూగజీవాల ప్రాణాలను కాపాడేందుకు ఇప్పటికైనా అధికారులు, పశువుల యజమానులు బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.




