Palakonda: భామినీ మండలంలో పాలకొండ సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!
Palakonda: పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాథ్ భామినీ మండలంలో విస్తృతంగా పర్యటించారు. నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.
Palakonda: భామినీ మండలంలో పాలకొండ సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీ!
పాలకొండ: భామినీ, సర్ డిజిటలైజేషన్ పనులను వేగవంతం చేయాలి పాలకొండ సబ్ కలెక్టర్ పవార్ స్వప్నిల్ జగన్నాద్ అన్నారు. భామినీ మండలంలో విస్తృతంగా పర్యటించి మండలంలోని బలేరు సచివాలయాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి, అక్కడ జరుగుతున్న సర్ డిజిటలైజేషన్ పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మాట్లాడుతూ, డిజిటలైజేషన్ ప్రక్రియలో ఎటువంటి ఆలస్యం కాకూడదని స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులోగా పనులను పూర్తి చేయాలని, ఇందుకోసం బూత్ స్థాయి అధికారులు మరింత వేగంగా, సమర్థవంతంగా పనిచేయాలని ఆదేశించారు.
తహశీల్దార్ కార్యాలయంలో సమీక్షా సమావేశం
సచివాలయ తనిఖీ అనంతరం, భామినీ తహశీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో సబ్ కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భామినీ తహశీల్దార్, ఎంపీడీఓ అందరు సూపర్‌వైజర్లు పాల్గొన్నారు. మండల వ్యాప్తంగా డిజిటలైజేషన్ పనుల స్థితిగతులపై ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, నిర్దేశించిన కాలపరిమితిలోనే ఈ ప్రక్రియ అంతా పూర్తి కావాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. పనులను వేగవంతం చేసేందుకు సంబంధిత అధికారులందరూ సమన్వయంతో పనిచేస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.




