Parvatipuram: అక్రమ ఇసుక రవాణాపై సబ్ కలెక్టర్ ఉక్కుపాదం
Parvatipuram: భామిని మండలం బత్తిలి వద్ద వంశధార నదిలో సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ ఆకస్మిక తనిఖీ. ఒడిశాకు అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లు సీజ్.
Parvatipuram: అక్రమ ఇసుక రవాణాపై సబ్ కలెక్టర్ ఉక్కుపాదం
Parvatipuram: భామిని మండలం బత్తిలి గ్రామ పరిధిలోని వంశధార నదిని సబ్ కలెక్టర్ స్వప్నిల్ పవార్ గారు పరిశీలించారు. ఈ సందర్భంగా ఒడిశా రాష్ట్రానికి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న రెండు ట్రాక్టర్లను గుర్తించి సీజ్ చేసి, వాటిని తహశీల్దార్ భామిని మరియు ఎస్.ఐ. బత్తిలి వారికి అప్పగించారు.
అలాగే చెక్‌పోస్ట్ పరిధిలో రిజిస్టర్‌ను తనిఖీ చేసి, ఎటువంటి అక్రమ ఇసుక రవాణా జరగకుండా ప్రతి వాహనాన్ని కచ్చితంగా తనిఖీ చేయాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Next Story




