Rajam: వెన్నుపోటుకు రెండేళ్లు: తలై రాజేష్ ఆధ్వర్యంలో వైసీపీ భారీ ర్యాలీ!

Rajam: రాజాంలో వైసీపీ ఆధ్వర్యంలో "వెన్నుపోటుకు రెండేళ్లు" కార్యక్రమం భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు.

SRIDHAR, RAJAM
Published on: 13 Jun 2026 8:13 AM IST
Rajam
X

Rajam: వెన్నుపోటుకు రెండేళ్లు: తలై రాజేష్ ఆధ్వర్యంలో వైసీపీ భారీ ర్యాలీ!

రాజాం: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజాంలో శుక్రవారం వైసీపీ ఆధ్వర్యంలో "వెన్నుపోటుకు రెండేళ్లు" కార్యక్రమంలో భాగంగా భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక పొనుగుటివలస రోడ్డులోని వైసీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ మాధవబజార్‌లోని వైఎస్సార్ విగ్రహం వరకు సాగింది.

వైసీపీ కేంద్ర కార్యాలయం ఆదేశాల మేరకు జూన్ 1 నుంచి నియోజకవర్గంలో దశలవారీగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. పోస్టర్, బుక్‌లెట్ ఆవిష్కరణతో ప్రారంభమైన ఈ కార్యక్రమాల ముగింపుగా భారీ ర్యాలీ చేపట్టారు.

ఈ సందర్భంగా వైసీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తలై రాజేష్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ హామీల పేరుతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. విద్య, వైద్య రంగాలను నిర్లక్ష్యం చేసి, రైతులను నష్టాల్లోకి నెట్టిందన్నారు. సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేయడంతో పాటు అమరావతి నిర్మాణంలో అవకతవకలకు పాల్పడుతున్నారని విమర్శించారు. విద్యా వ్యవస్థను దెబ్బతీస్తూ విద్యార్థులకు నాణ్యమైన పుస్తకాలు, బ్యాగులు అందించడం లేదని ఆరోపించారు.

కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తలై భద్రయ్య, నియోజకవర్గ పరిశీలకుడు సూర్యనారాయణ రాజు, రాజాం పట్టణ అధ్యక్షుడు పాలవలస శ్రీనివాసరావు, వివిధ మండలాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

SRIDHAR, RAJAM

SRIDHAR, RAJAM

Next Story