Mandasa: మందస టీడీపీ కార్యాలయంలో 'SIR' సర్వేపై అవగాహన సదస్సు
Mandasa: మందస మండలంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే (SIR) పై టీడీపీ విస్తృత అవగాహన సదస్సు.
Mandasa: మందస టీడీపీ కార్యాలయంలో 'SIR' సర్వేపై అవగాహన సదస్సు
మందస : పలాస నియోజకవర్గ పరిధిలోని మందస మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఆదివారం పార్టీ శ్రేణుల కోలాహలంతో సందడిగా మారింది. పలాస శాసనసభ్యురాలు శ్రీమతి గౌతు శిరీష స్పష్టమైన ఆదేశాల మేరకు, రాబోయే రోజుల్లో అత్యంత కీలకమైన "ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే (SIR)" ప్రక్రియపై మండల స్థాయి విస్తృత అవగాహన సదస్సు అత్యంత విజయవంతంగా నిర్వహించబడింది.
ఓటు హక్కు అక్రమార్కుల పాలు కాకూడదు:
ఈ కీలక సమావేశానికి మందస మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ బావన దుర్యోధన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత శక్తివంతమైన ఆయుధం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడంతో పాటు, ఓటర్ల జాబితాలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా క్షేత్రస్థాయిలో ప్రతి బూత్ పరిధిని క్షుణ్ణంగా పరిశీలించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉంది. ఎమ్మెల్యే గౌతు శిరీష గారి నాయకత్వంలో మందస మండలంలో SIR సర్వేను పకడ్బందీగా ముందుకు తీసుకెళ్తాం.
సమన్వయంతో ముందుకు సాగాలి: మండల ప్రధాన కార్యదర్శి శ్రీ సాలీనా మాధవ రావు, క్లస్టర్ ఇంచార్జీ దాసరి తాతారావు పాల్గొని, గ్రామాల్లో క్లస్టర్, యూనిట్ మరియు బూత్ స్థాయి నాయకులు సమన్వయంతో పని చేయాలని పిలుపునిచ్చారు.
ముఖ్య ఉద్దేశం: అర్హులైన యువతీ యువకులకు కొత్త ఓట్ల నమోదు, జాబితాలో తప్పుల సవరణలపై ప్రజల్లో అవగాహన కల్పించడం.
దిశానిర్దేశం: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సర్వే (SIR) లో అనుసరించాల్సిన వ్యూహాలు, క్షేత్రస్థాయిలో చేపట్టవలసిన చర్యలపై నాయకులకు మరియు కార్యకర్తలకు అవగాహన కల్పించారు. ఈ అవగాహన సదస్సుకు నియోజకవర్గ, మండల స్థాయి ప్రజాప్రతినిధులు, క్లస్టర్, యూనిట్ ఇంచార్జీలు, కో-ఇంచార్జీలు, క్రియాశీలక కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలివచ్చి తమ సందేహాలను నివృత్తి చేసుకున్నారు. పలాసలో వైసీపీ 'మద్యం' డ్రామాలు.. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుంది: పలాస నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ) నాయకులు మద్యంపై చేస్తున్న పోరాటాలు చూస్తుంటే.. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చేందుకు చేసిన మరో మహా ఉద్యమంలా కలరింగ్ ఇస్తున్నారని టీడీపీ నాయకులు తీవ్రంగా ఎద్దేవా చేశారు. గత ఐదేళ్ల తమ నల్లని చరిత్రను మర్చిపోయి, నేడు వీధులకెక్కి విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు.
మీ ఐదేళ్ల 'క్యాష్' చరిత్ర మర్చిపోయారా.. : ఈ సందర్భంగా టీడీపీ నేత భావన దుర్యోధన మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం దోపిడీని ప్రజలు ఇంకా మర్చిపోలేదని గుర్తు చేశారు.
నాసిరకం మద్యం: కల్తీ స్పిరిట్‌తో నాసిరకం మద్యం తయారు చేసి, ప్రభుత్వ దుకాణాల ద్వారానే అమ్మిస్తూ ప్రజల ప్రాణాలతో ఆడుకుంది మీ వైసీపీ ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు.
మనీ లాండరింగ్: ఆన్-లైన్ పేమెంట్లు లేకుండా కేవలం నగదు (క్యాష్) రూపంలోనే లావాదేవీలు జరుపుతూ భారీ మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారని, ఆ సొమ్మంతా అప్పటి ముఖ్యమంత్రి, స్థానిక వైసీపీ నేతల జేబుల్లోకే వెళ్ళిందని ధ్వజమెత్తారు.
ఉపాధ్యాయులకు అవమానం: చివరికి సమాజంలో ఎంతో గౌరవప్రదమైన స్థానంలో ఉండే ప్రభుత్వ ఉపాధ్యాయులను (గవర్నమెంట్ టీచర్లను) మద్యం షాపుల ముందు కాపలా నిలబెట్టి, సభ్య సమాజం తలదించుకొనేలా చేసిన ఘనత ముమ్మాటికీ వైసీపీదేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభివృద్ధి : పలాస శాసనసభ్యురాలు శ్రీమతి గౌతు శిరీష నియోజకవర్గంలో శరవేగంగా చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు కుట్ర పూరిత విమర్శలకు దిగుతున్నారని మండిపడ్డారు. మద్యం మీద అక్రమ వసూళ్లు జరుగుతున్నాయంటూ వారు చేస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయ ఉనికి కోసమేనని కొట్టిపారేశారు. వైసీపీ నేతలు ఎన్ని రకాలుగా అబద్ధపు ప్రచారాలు చేసినా పలాస ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. గత ఐదేళ్ల మీ అవినీతి పాలనను, ప్రస్తుత ఎమ్మెల్యే గౌతు శిరీష గారి అభివృద్ధి మంత్రాన్ని ప్రజలు గమనిస్తున్నారు. మీ డ్రామాలకు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ధ్వజమెత్తారు.




