Kanchili: విజయోత్సవ వేళ సేవాభావం.. వృద్ధులకు అన్నదానం చేసిన టీడీపీ నాయకులు!

Kanchili: కంచిలి మండలంలో టీడీపీ ఘనవిజయం సాధించిన సందర్భంగా, ఆ పార్టీ నాయకులు మండపల్లిలోని సీతయ్య ఫౌండేషన్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదానం చేశారు.

G.RAMBABU, SOMPET
Published on: 12 Nov 2026 12:10 PM IST
Kanchili
X

Kanchili: విజయోత్సవ వేళ సేవాభావం.. వృద్ధులకు అన్నదానం చేసిన టీడీపీ నాయకులు!

Kanchili: కంచిలి మండలంలో జెడ్పీటీసీతో పాటు 17 ఎంపీటీసీ స్థానాల్లో తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ నాయకులు సేవా కార్యక్రమంతో తమ ఆనందాన్ని పంచుకున్నారు.

విజయోత్సవ వేళ ఆడంబరాలకు దూరంగా, నిరాశ్రయ వృద్ధుల ఆకలి తీర్చాలనే సంకల్పంతో కొల్లూరు పంచాయతీ కర్తలి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ పైల సూర్యనారాయణ, ఐటీడీపీ కంచిలి మండల అధ్యక్షుడు వాసాల రమేష్ రెడ్డి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

బుధవారం కంచిలి మండలం మండపల్లి సమీపంలోని సీతయ్య ఫౌండేషన్ వృద్ధాశ్రమాన్ని సందర్శించిన వారు అక్కడ ఆశ్రయం పొందుతున్న వయోవృద్ధులు, అనాథలకు అన్నదానం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ పెద్ద రెడ్డి భగీరథి, యువకులు పరపటి గోపాల్, మణి, నేతాజీ తదితరులు పాల్గొన్నారు. విజయాన్ని సేవా కార్యక్రమం ద్వారా పంచుకోవడం అభినందనీయమని ఆశ్రమ నిర్వాహకులు పేర్కొంటూ దాతలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET