Jadipudi: జాడిపూడిలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి పిలక బోగేస్ జోరుగా ప్రచారం!

Jadipudi: శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం జాడిపూడిలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి పిలక బోగేస్ ఉత్సాహంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 23 Oct 2026 2:21 PM IST
Jadipudi
X

Jadipudi: జాడిపూడిలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి పిలక బోగేస్ జోరుగా ప్రచారం!

Jadipudi: కంచిలి మండలం జాడిపూడి గ్రామంలో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి పిలక బోగేస్ శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామంలో ప్రజలను కలుసుకుంటూ తనకు మద్దతు తెలిపి ఎంపీటీసీగా గెలిపించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొని అభ్యర్థికి మద్దతు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పిలక చిన్నబాబు, పెద్దకొజ్జిరి మాజీ సర్పంచ్ బొడ్డ రామ్ కుమార్, ధర్మ యాదవ్, ఉమాపతి,తో పాటు పలువురు కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్