Kanchili: కంచిలి మండలం పెద్ద కొజ్జిరియాలో బొడ్డ సంధ్యారాణి ఇంటింటి ప్రచారం!
Kanchili: కంచిలి మండలం పెద్ద కొజ్జిరియా పంచాయతీ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ సర్పంచ్ అభ్యర్థి బొడ్డ సంధ్యారాణి ఆదివారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
Kanchili: కంచిలి మండలం పెద్ద కొజ్జిరియాలో బొడ్డ సంధ్యారాణి ఇంటింటి ప్రచారం!
కంచిలి: పెద్ద ఖోజ్జిరియా గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారంలో టీడీపీ సర్పంచ్ అభ్యర్థి బొడ్డ సంధ్యారాణి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆదివారం పెద్దకొజ్జిరియా పంచాయితీ గ్రామంలో పర్యటిస్తూ ఓటర్లను ఆప్యాయంగా పలకరించారు. గ్రామస్థులతో మమేకమై తనకు మద్దతు ఇవ్వాలని కోరారు.ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రజల మద్దతుతో గ్రామ సమస్యల పరిష్కారానికి, అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఈ ప్రచార కార్యక్రమంలో తన భర్త బొడ్డ రామ్ కుమార్, బొడ్డ హరిబాబు, బొడ్డ జగ్గారావు, బాలక నారాయణమూర్తి, బొడ్డ ఆదర్శ్, బొడ్డ కవిబాబు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, గ్రామస్థులు పాల్గొన్నారు.




