Tekkali: కేసుల నుంచి తప్పించుకోవడానికే సీఐపై ఆరోపణలు

Tekkali: టెక్కలి సీఐ విజయ్ కుమార్‌పై తప్పుడు ఆరోపణలు చేసిన రౌడీషీటర్ కొమ్ము తరుణ్ కుమార్ నేర చరిత్రను డీఎస్పీ లక్ష్మణరావు బయటపెట్టారు.

RAMBABU, TEKKALI
Published on: 12 July 2026 8:03 AM IST
Tekkali
X

Tekkali: కేసుల నుంచి తప్పించుకోవడానికే సీఐపై ఆరోపణలు

Tekkali: సోషల్ మీడియాలో టెక్కలి C.I విజయకుమార్ పై నిందారోపణలు చేసిన కొమ్ము.తరుణ్ కుమార్ అనే వ్యక్తిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టెక్కలి DSP లక్ష్మణరావు శనివారం టెక్కలి పోలీసుస్టేషనులో ప్రెస్ మీట్ నిర్వహించారు.

గతంలో తనపైన నమోదు కాబడిన కేసులకు శిక్ష పడుతుంది అనే భయంతోనే టెక్కలి C.I విజయ్ కుమార్ పై నిందారోపణలు చేశారు అని అన్నారు,పోలీసులు పై నిందారోపణలు చేస్తే కేసులనుంచి తప్పించుకోవచ్చు అని అనుకోవడం అవివేకం అని తెలిపారు,

కొమ్ము తరుణ్ కుమార్ పై రిజిస్టర్ కాబడిన కేసుల గురించి టెక్కలి D.S.P తెలిపిన వివరాలు:

1. 07-04-2022 లో CR no:85/2022 U/S 448,392 ipc of Tekkali p.s

2. ⁠11-05-2023 cr.no 108/2023 u/s 419,386 R/w 34 IPC of Tekkali P.s

3. ⁠కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు.రామ్మోహన్నాయుడు పేరుతో ఫేస్ బుక్ అకౌంట్ ఓపెన్ చేసి ఒక మహిళతో పరిచయం పెంచుకొని తానే రామ్మోహన్ నాయుడు అని నమ్మించి ఆమె దగ్గర 30 లక్షల రూపాయలు కాజేసినట్లు టెక్కలి పోలీస్ స్టేషన్ లో కొమ్ము.తరుణ్ కుమార్ పై కేసు నమోదు కాబడినది,ఈ కేసులుకు సంబంధించి కొమ్ము.తరుణ్ కుమార్ పై రౌడీ షీట్ కూడా ఓపెన్ చేశాము అని తెలిపారు,

ఐతే గతంలో టెక్కలి C.I విజయ్ కుమార్ తనను కావాలనే దుర్వుద్ధేశ్యంతో ఎటువంటి ఆధారాలు లేకుండా తనను అక్రమంగా అరెస్ట్ చేసి తన వద్ద ఒక లక్షరూపాయలు మరియు రెండు ఫోన్స్ తీసుకొని తనను శారీరకంగా మానసికంగా చిత్రవధ చేసి వేధించారు అని కొమ్ము.తరుణ్ కుమార్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో విరుచుకు పడ్డాడు.తదుపరి తనకు జరిగిన అన్యాయంపై టెక్కలి అంబేద్కర్ జంక్షన్లో నిరాహార దీక్షకు చేపడతాను అని నిర్ణయిచ్చుకుంటే టెక్కలి పోలీసులు గృహనిర్బంధం చేశారు అని మీడియా వేదిక తెలిపాడు.

అయితే కొమ్ము తరుణ్ కుమార్ ఈ కేసుల నుండి తప్పించు కొనడానికి టెక్కలి C.I తనను కులం పేరుతో దూషించారు అని అక్రమంగా అరెస్ట్ చేశారు అని వాస్తవాలు లేని తప్పుడు ఆరోపణలు చేశాడు అని తెలిపారు

కొమ్ము తరుణ్ కుమార్ వేసే ప్రతి అడుగు కూడా పోలీసులు నిఘాలో ఉంటుంది అని టెక్కలి DSP లక్ష్మణరావు మీడియా ముఖంగా పేర్కొన్నారు.

RAMBABU, TEKKALI

RAMBABU, TEKKALI

Next Story