Tekkali: టెక్కలిలో కరపత్రాల కలకలం: టౌన్ సీఐకి తుది హెచ్చరిక!

Tekkali: శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో టౌన్ సీఐ విజయ్ కుమార్‌కు కమ్యూనిస్ట్ పార్టీ లోగోతో తుది హెచ్చరిక జారీ చేస్తూ వెలసిన కరపత్రాలు కలకలం రేపాయి.

Dalisetty Bhaskar, Tekkali
Published on: 16 Nov 2026 2:31 PM IST
Tekkali
X

Tekkali: టెక్కలిలో కరపత్రాల కలకలం: టౌన్ సీఐకి తుది హెచ్చరిక!

టెక్కలి: టౌన్ సీఐ విజయ్ కుమార్ కు కమ్యూనిస్ట్ పార్టీ లోగో తో కలిగిన హెచ్చరిక పత్రాలు జారీ. టెక్కలి గవర్నమెంట్ డిగ్రీ కళాశాల లో దర్శనం ఇచ్చిన కరపత్రాలు. సామాన్యులను హింసిస్తూ అక్రమ కేసులను బాణాయిస్తున్న అంబటి విజయ్ కుమార్ కు తుది హెచ్చరిక అంటూ కర పత్రాలు. నువ్వు ఈ మధ్య కాలంలో చేసిన దందాలు అన్నీ తెలుసు కాబట్టి జాగ్రత్త అంటూ హెచ్చరిక.

రానున్న పంచాయితీ ఎలక్షన్స్ లో కనిపిస్తే తరిమి తరిమి కొడతాం అంటూ హెచ్చరికలు జారీ చేసిన కరపత్రాలు ప్రస్తుతం టెక్కలి లో హాట్ టాపిక్ గా మారాయి. అయితే ఈ ప్రకటన పత్రాలు ఎవరు పెట్టారు అనేకోణం లో పోలీస్లు ప్రస్తుతం దర్యాప్తు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది.

Dalisetty Bhaskar, Tekkali

Dalisetty Bhaskar, Tekkali