Tekkali: టెక్కలి రైలు ప్రమాద బాధితులకు రూ.5 లక్షల పరిహారం!

Tekkali: టెక్కలి రావివలస రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా: బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు.

RAMBABU, TEKKALI
Published on: 24 Sept 2026 4:05 PM IST
Tekkali
X

Tekkali: టెక్కలి రైలు ప్రమాద బాధితులకు రూ.5 లక్షల పరిహారం!

టెక్కలి: టెక్కలి మండలం రావివలస సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో మృతిచెందిన 4 గురు యువకుల కుటుంబాలను వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పరామర్శించారు. అలాగే మృతుల కుటుంబాలకు ప్రభుత్వం తరఫున రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు.

రైలు ప్రమాదంలో యువకులు మృతిచెందడం అత్యంత బాధాకరమనీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు, యుక్త వయసులో ఉన్న యువకులును కోల్పోవడం గ్రామాల్లో గాని ఇటు కుటుంబాల్లో గాని తీరని లోటు మిగిల్చిందని తెలిపారు.

ఈ విషాద సమయంలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాధిత కుటుంబాలకు అవసరమైన అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తాం అని తెలిపారు. చనిపోయిన నలుగురు యువకుల కుటుంబ సభ్యులను ఓదార్చి వారికి ధైర్యం చెప్పారు.

RAMBABU, TEKKALI

RAMBABU, TEKKALI