Kurupam: కురుపాం బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి భరోసా

Kurupam: కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి ఆధ్వర్యంలో గుమ్మలక్ష్మీపురం మండల బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) చెక్కుల పంపిణీ.

V.SESHU	, KURUPAM
Published on: 24 April 2026 7:29 PM IST
Kurupam
X

Kurupam: కురుపాం బాధితులకు ముఖ్యమంత్రి సహాయ నిధి భరోసా

Kurupam: ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరిని ఆదుకోవడమే లక్ష్యంగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్ & కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరిఅన్నారు.గుమ్మలక్ష్మీపురం మండలం వాడబాయి, చింతలపాడు, రేగిడి గ్రామాలకి చెందిన పత్తిక యమున, కిల్లక సుస్మిత, నిమ్మక సీతారాం అనారోగ్యానికి గురై ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారనే విషయం ప్రభుత్వ విప్ మరియు కురుపాం శాసనసభ్యురాలు దృష్టికి రావడంతో,

వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి సహాయమందేలా కృషి చేసి, సహాయనిధి నుండి పత్తిక యమున కి 32,000/- , కిల్లక సుస్మిత కి 33,191/- , నిమ్మక సీతారాం కి 61,400/- రూపాయల చెక్కులను శుక్రవారం నాడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం గుమ్మలక్ష్మీపురంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికి సహాయం అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం పని చేస్తుందని,

ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి సహాయనిధి నుండి అందించిన ఆర్థిక సహాయమే అందుకు నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి విజయనగరం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ డొంకాడ రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి బిడ్డిక పద్మావతి, ఏఎంసీ చైర్మన్ కడ్రక కళావతి, రాష్ట్ర నాటక రంగ అకాడమీ డైరెక్టర్ అంబటి రాంబాబు, అరకు పార్లమెంట్ సహాయ కార్యదర్శి తాడంగి రామారావు,

గుమ్మలక్ష్మీపురం మండల పార్టీ అధ్యక్షులు అడ్డాకుల నరేష్, రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి కోలా రంజిత్ కుమార్, మాజీ మండల కన్వీనర్ పాడి సుదర్శనరావు, నియోజకవర్గ మహిళా కార్యదర్శి వెంపటాపు భారతి, తోటపల్లి దైవస్థానం డైరెక్టర్ ఆరిక జానకి, బిజెపి మండల కన్వీనర్ కడ్రక అప్పలస్వామి, నిమ్మక సింహాచలం, తాడంగి లక్ష్మణరావు, నాయకులు చిన్నా, దామోదర్ రావు, రాజేష్, కొండలరావు, సుదర్శన్ రావు, కామేష్, రాజేష్, మనోహర్, క్రాంతికుమార్, శాంతి, రవి, లక్ష్మి, కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

V.SESHU	, KURUPAM

V.SESHU , KURUPAM

Next Story