Palasa: మొగిలిపాడు కూడలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: మహిళ దుర్మరణం!
Palasa: పలాస మండలం మొగిలిపాడు కూడలి వద్ద గురువారం ఆగి ఉన్న లారీని స్కూటీ ఢీకొన్న ప్రమాదంలో టెక్కలికి చెందిన పువ్వుల మధు (30) మృతిచెందారు.
Palasa: మొగిలిపాడు కూడలి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: మహిళ దుర్మరణం!
పలాస: పలాస మండలం మొగిలిపాడు కూడలి వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కలి తెలగవీధికి చెందిన పువ్వుల మధు(30) ఏళ్ల మహిళ మృతిచెందింది. స్థానికుల వివరాలు మేరకు ఏపీ40ఎంబీ 4527 నంబరు గల స్కూటీ పై పలాస వెళ్తుండగా ఆగి ఉన్న లారీని వెనుక నుండి బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతురాలు కుటుంబసభ్యులకు సమాచారం అందించారు.




