Pathapatnam: శత్రుచర్ల విజయరామరాజుకు పాతపట్నంలో ఘన నివాళి!

Pathapatnam; ఉత్తరాంధ్ర ప్రజల అభిమాన నాయకుడు శత్రుచర్ల విజయరామరాజు చిత్రపటానికి పాతపట్నంలో కళాశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్, అధ్యాపకులు, విద్యార్థులు ఘన నివాళులర్పించారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM
Published on: 14 Nov 2026 3:38 PM IST
Pathapatnam
X

Pathapatnam: శత్రుచర్ల విజయరామరాజుకు పాతపట్నంలో ఘన నివాళి!

Pathapatnam: ఉత్తరాంధ్ర ప్రజలకు ప్రాతః స్మరణీయుడు మన శత్రుచర్ల విజయరామరాజు గారు పాతపట్నం ప్రాంతంతో ప్రజలతో సుదీర్ఘమైన అనుబంధం కలిగినటువంటి నేత ఈ ప్రాంత అభివృద్ధిలో తనదైన ముద్ర వేసుకున్న నేత రాజుగా పుట్టి రాచరికపు హోదాలను ప్రక్కన పెట్టి నిరంతరం ప్రజల కోసం పనిచేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అర్ధరాత్రి సైతం తన తలుపులు ప్రజాసేవకై తెరిచి ఉంటాయని నిర్బంధంగా చెప్పిన విలక్షణమైన ప్రజానేత.

ఐదు సార్లు ఎమ్మెల్యేగా మూడు సార్లు పార్లమెంటు సభ్యునిగా ఒక పర్యాయం ఎమ్మెల్సీగా సేవలందించి పదవులకే అలంకారంగా నిలిచినటువంటి నిజాయితీ కలిగిన అవినీతి ఎరుగని మహా నాయకుడు శత్రుచర్ల ప్రజా బహుళయానికి మంచి చేసే క్రమంలో సిద్ధాంతాలకు కట్టుబడి అవసరమైతే పదవులను తృణప్రాయంగా త్యజించగలిగిన దమ్మున్న నాయకుడు మన శత్రుచర్ల విజయరామరాజు గారు ఆయన హయాంలోనే పాతపట్నంలో మోడల్ డిగ్రీ కళాశాల మోడల్ స్కూల్ మరియు జూనియర్ కళాశాల ఏకలవ్య స్కూల్ మినీ స్టేడియం వంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది.

అపర చాణిక్యనిగా పేరుగాంచిన శత్రుచర్ల సైనికునుకున్నంత దేశభక్తితో రాజకీయాలు చేసి రాజకీయ నాయకుల్లో అరుదైనటువంటి రాజకీయ నాయకుడిగా పేరుగాంచారు.

ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ శాసనసభ ప్రిన్సిపాల్ ఆంజనేయులు వైస్ ప్రిన్సిపాల్ బీవీ రమణ మరియు అధ్యాపక బృందం అలాగే విద్యార్థిని విద్యార్థులు యావన్మంది పాల్గొని విజయరామరాజు చిత్రపటానికి పూలమాలతో అలంకరించి పుష్పగుత్యాలు సమర్పించి దీప ప్రజ్వలన గావించి వారి ఆత్మకు సభ్యతలు కలగాలని ప్రార్థిస్తూ రెండు నిమిషాలు మౌనం పాటించారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

A.SANTHOSH KUMAR, PATHAPATNAM