Sompeta: ప్రజల చెంతకు కేంద్ర మంత్రి.. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం

Sompeta: శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం నడుమూరులో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు చేపట్టిన 'పల్లె నిద్ర' కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

G.RAMBABU, SOMPET
Updated on: 2 May 2026 11:34 AM IST
Sompeta
X

Sompeta: ప్రజల చెంతకు కేంద్ర మంత్రి.. ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యం

శ్రీకాకుళం జిల్లా: సోంపేట మండలం నడుమూరు గ్రామంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రభుత్వ విప్ డాక్టర్ అశోక్ బాబు తో కలిసి చేపట్టిన 'పల్లె నిద్ర' కార్యక్రమం శనివారం విజయవంతంగా ముగిసింది.గత శుక్రవారం రాత్రి నడుమూరు గ్రామంలో బస చేసిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, గ్రామస్థులతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ఎలా అమలవుతున్నాయో స్వయంగా పరిశీలించారు. గ్రామంలో రాత్రి బసకు సహకరించిన నడుమూరు గ్రామస్థుల ఆతిథ్యానికి మంత్రి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. గ్రామాల అభివృద్ధే దేశ అభివృద్ధి అని, ప్రజల మధ్య ఉండేందుకే 'పల్లె నిద్ర' కార్యక్రమం చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story