Rajam: స్వయంగా రంగంలోకి దిగి వరద మార్గాన్ని సుగమం చేసిన వంజరంపేత వాసి!
Rajam: తుఫాను వర్షాలకు రాజాం-సారధి రహదారి వంతెన వద్ద పేరుకుపోయిన చెత్తను స్వయంగా తొలగించిన వంజరంపేటకు చెందిన మిత్తిరెడ్డి మధుసూదన్‌రావు.
Rajam: స్వయంగా రంగంలోకి దిగి వరద మార్గాన్ని సుగమం చేసిన వంజరంపేత వాసి!
Rajam: ఇటీవల తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు రాజాం–సారధి రహదారిలోని చిన్న వంతెన వద్ద భారీగా చెత్త, మట్టి పేరుకుపోయి రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. అంతేకాకుండా వరద నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడి, సమీపంలోని రెండు, మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయే పరిస్థితి నెలకొంది.
ఈ పరిస్థితిని గమనించిన వంజరంపేటకు చెందిన మిత్తిరెడ్డి మధుసూదన్‌రావు ఎవరో వచ్చి సమస్యను పరిష్కరిస్తారని ఎదురుచూడకుండా స్వయంగా రంగంలోకి దిగారు. ఒక్కడే వంతెనపై పేరుకుపోయిన చెత్త, మట్టిని తొలగించి, వరద నీరు సజావుగా వెళ్లేలా మార్గాన్ని సుగమం చేశారు.
మిత్తిరెడ్డి మధుసూదన్‌రావు చూపిన సామాజిక బాధ్యతపై పలువురు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ తమ గ్రామం పట్ల ఇదే విధమైన బాధ్యతతో ముందుకు రావాలని గ్రామ పెద్దలు ఆకాంక్షించారు.




