Rajam: రాజాంలో అక్రమ నిల్వలపై విజిలెన్స్ అధికారుల మెరుపు దాడులు!
Rajam: రాజాం, సంతకవిటి మండలాల్లో విజిలెన్స్ అధికారుల దాడులు. అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన రూ. లక్షల విలువైన వరి విత్తనాలు, యూరియా బస్తాల సీజ్.
Rajam: రాజాంలో అక్రమ నిల్వలపై విజిలెన్స్ అధికారుల మెరుపు దాడులు!
Rajam: రాజాం, సంతకవిటి మండలాల్లో వ్యవసాయ శాఖ అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన విత్తనాలు, ఎరువులపై విజిలెన్స్ అధికారులు బుధవారం దాడులు నిర్వహించారు. మండవకురిటి గ్రామంలోని శ్రీ లక్ష్మీ శ్రీనివాస ఎంటర్‌ప్రైజెస్ వద్ద లైసెన్స్ పూర్తికాకముందే 41 క్వింటాళ్ల అమూల్య గోల్డ్ వరి విత్తనాలను నిల్వ ఉంచినట్లు గుర్తించి సీజ్ చేశారు.
విజిలెన్స్ అధికారి రామారావు, ఎంఏవో యశ్వంత్ కుమార్ మాట్లాడుతూ, విత్తనాల విక్రయానికి అవసరమైన లైసెన్స్ లేకపోవడంతో రూ.5.33 లక్షల విలువైన విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
అదేవిధంగా జ్యోతీశ్వరరావు ట్రేడర్స్ వద్ద స్టాక్ రికార్డులను పరిశీలించగా, నమోదులో ఉండాల్సిన 74 బస్తాల కిర్బికో యూరియా కొరత ఉన్నట్లు గుర్తించారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా నిల్వ ఉంచిన రూ.26.63 లక్షల విలువైన 1,261 యూరియా బస్తాలను సీజ్ చేసినట్లు వెల్లడించారు.
మరో 19 మెట్రిక్ టన్నుల (సుమారు 442 బస్తాలు) యూరియా వివరాలు స్టాక్ రికార్డుల్లో నమోదు చేయకపోవడాన్ని కూడా అధికారులు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంపై 6ఏ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.




