Narasannapeta: నరసన్నపేటలో విషాదం: విద్యుత్ షాక్‌తో వెల్డర్ మృతి!
Narasannapeta: శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలో వెల్డింగ్ చేస్తుండగా విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Narasannapeta: నరసన్నపేటలో విషాదం: విద్యుత్ షాక్‌తో వెల్డర్ మృతి!
Narasannapeta: నరసన్నపేట మండలంలోని మడపం గ్రామ పరిధిలో వెల్డింగ్ పనులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురై ఓ వ్యక్తి మృతి చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది. మండలంలోని చేనులవలస గ్రామానికి చెందిన సరిపల్లి రామచంద్రరావు (35)మడపాంలోని ఓ కంపెనీలో వెల్డింగ్ పనులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌కు గురైనట్లు స్థానికులు తెలిపారు.
తీవ్రంగా గాయపడిన ఆయనను వెంటనే నరసన్నపేట ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు సమాచారం. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




