Srikakulam: విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట ఎమ్మెల్యే బెందాళం అశోక్

Srikakulam: ఇచ్ఛాపురం బాలుర జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్ ఛాంబర్‌ను విప్ బెందాళం అశోక్ ప్రారంభించారు. జనసేన ఇన్‌చార్జ్ దాసరి రాజు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

Dharmavarapu Saikumar, Ichapuram
Published on: 8 Oct 2026 1:19 PM IST
Srikakulam
X

Srikakulam: విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట ఎమ్మెల్యే బెందాళం అశోక్

Srikakulam: ఇచ్ఛాపురం స్థానిక బాలుర ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నూతనంగా నిర్మించిన ప్రిన్సిపాల్ కార్యాలయాన్ని (ఛాంబర్‌ను) గురువారం ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్ఛాపురం , ప్రభుత్వ విప్, స్థానిక శాసనసభ్యులు బెందాళం అశోక్ హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించి రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ బాబు మాట్లాడుతూ.. విద్యా రంగానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తోందని, విద్యార్థులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రభుత్వ విద్యా సంస్థలను మరింత బలోపేతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ దాసరి రాజు, కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపక బృందం కూటమి నాయకులు, కార్యకర్తలు, పూర్వ విద్యార్థులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Dharmavarapu Saikumar, Ichapuram

Dharmavarapu Saikumar, Ichapuram