Rajam: రాజాం మండలం కొండంపేటలో మహిళా ఏఈ అనుమానాస్పద మృతి!
Rajam: రాజాం మండలం కొండంపేట స్మశానవాటిక సమీపంలో చీపురుపల్లి విద్యుత్ శాఖ ఏఈ లలితకుమారి ముఖంపై గాయాలతో అనుమానాస్పద స్థితిలో మృతి చెంది పడివుండటం కలకలం రేపింది.
Rajam: రాజాం మండలం కొండంపేటలో మహిళా ఏఈ అనుమానాస్పద మృతి!
Rajam: ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, రాజాం: రాజాం మండలం కొండంపేటలో ఆదివారం లలితకుమారి అనే మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.
కొండంపేట నుంచి ప్రధాన రహదారికి వెళ్లే మార్గంలోని స్మశానవాటిక సమీపంలో ముఖంపై గాయాలతో ఉన్న మహిళ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మృతదేహం పక్కనే AP39GH7007 నంబర్ గల స్కూటీ, క్యాంప్ బ్యాగ్ ఉండటంతో పోలీసులకు సమాచారం అందించారు.
సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించగా, మృతురాలు చీపురుపల్లి విద్యుత్ శాఖ కార్యాలయంలో ఏఈగా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఆమె భర్త, ఇద్దరు పిల్లలతో కలిసి కొండంపేటలో నివాసం ఉంటున్నట్లు సమాచారం.
మృతురాలి భర్త రాజును పోలీసులు విచారించగా, ఉదయం తన భార్య యోగా క్లాసుకు వెళ్లినట్లు తెలిపినట్లు సమాచారం. మహిళ మృతిపై అనుమానాలు ఉండటంతో పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు పోలీసుల విచారణ అనంతరం వెల్లడయ్యే అవకాశం ఉంది.




