Sompeta: కోటి మందితో 'యోగాంధ్ర': గిన్నిస్ రికార్డే లక్ష్యంగా కూటమి సర్కార్ భారీ ప్లాన్!

Sompeta: ఈ నెల 21న కోటి మందితో 'యోగాంధ్ర' కార్యక్రమం. బారువా బీచ్‌ను అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని వెల్లడించిన ప్రభుత్వ విప్ బెందాళం అశోక్.

G.RAMBABU, SOMPET
Published on: 11 Jun 2026 1:01 PM IST
Sompeta
X

Sompeta: కోటి మందితో 'యోగాంధ్ర': గిన్నిస్ రికార్డే లక్ష్యంగా కూటమి సర్కార్ భారీ ప్లాన్!

Sompeta: కూటమి ప్రభుత్వం నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా 'యోగాంధ్ర' కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని ప్రభుత్వ విప్, స్థానిక ఎమ్మెల్యే బెందాళం అశోక్ అన్నారు. సోంపేట మండల పరిధిలోని బారువా బీచ్ తీరంలో మత్స్యకారుల థీమ్‌తో నిర్వహించిన ప్రత్యేక యోగా వేడుకల్లో ఆయన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌తో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ.. యోగా అనేది దేశానికి ఉన్న పెద్ద సంపద అని, దీని ద్వారా మానసిక, శారీరక ఆరోగ్యం మెరుగుపడుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారని కొనియాడారు.

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లక్ష్యంగా ఈనెల 21న రాష్ట్రంలో కోటి మందితో భారీ ఎత్తున యోగా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వివరించారు. బారువా బీచ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, ఇక్కడ రెస్టారెంట్లు ఏర్పాటు చేసి స్థానికులకు పెద్దపీట వేస్తూ ఉపాధి కల్పిస్తామన్నారు. నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి టూరిజం రంగాన్ని బలోపేతం చేయడమే ఏకైక మార్గమని ఆయన ఆకా.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story