Patapatnam: పాతపట్నం ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు

Patapatnam: పాతపట్నంలో వైఎస్సార్ జయంతి వేడుకలు. తమ్మినేని సీతారాం, రెడ్డి శాంతి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం, పండ్ల పంపిణీ.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM
Published on: 8 July 2026 8:08 PM IST
Patapatnam
X

Patapatnam: పాతపట్నం ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు

పాతపట్నం: శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి సందర్భంగా పాతపట్నం నియోజకవర్గంలోని మాజీ ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ స్పీకర్ వైఎస్ఆర్సిపి పిఏసి నెంబర్ మరియు జిల్లా పార్లమెంటు ఇంచార్జీ తమ్మినేని సీతారాం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ముందుగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం పాతపట్నం సామాజిక ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు.

అనంతరం స్థానిక KSM ప్లాజా నందు మెగా వైద్య శిబిరం మరియు రక్తదానం నిర్వహించారు. నాయకులందరితో కలిసి కేక్ ని కట్ చేసి అందరూ ఆనందంగా జరుపుకున్నారు.

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

A.SANTHOSH KUMAR, PATHAPATNAM

Next Story