Ichapuram: ఇచ్చాపురం ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు

Ichapuram: ఇచ్చాపురంలో వైఎస్సార్ జయంతి వేడుకలు. విగ్రహానికి నివాళులర్పించిన పిరియా విజయ, నర్తు రామారావు, సాడి శ్యాంప్రసాద్ రెడ్డి. రక్తదాన, వైద్య శిబిరాలు నిర్వహణ.

G.RAMBABU, SOMPET
Published on: 8 July 2026 3:41 PM IST
Ichapuram
X

Ichapuram: ఇచ్చాపురం ఘనంగా వైఎస్సార్ 77వ జయంతి వేడుకలు

ఇచ్చాపురం: శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 77వ జయంతి వేడుకలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా నిర్వహించారు. జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ,MLC నర్తు రామారావు ఇచ్చాపురం వైసీపీ ఇంచార్జ్ సాడి శ్యాంప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఇచ్చాపురం బస్ స్టాండ్ కూడలిలో ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ప్రజల కోసం రక్తదాన శిబిరం, ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, స్వర్గీయ వైఎస్సార్ పాలనలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమంలో ముందంజలో నిలిచిందని పేర్కొన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పాలనను ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని అభిప్రాయపడ్డారు. వైఎస్సార్ ఆశీస్సులతో 2029 ఎన్నికల్లో వైఎస్ జగన్ మరోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, వైద్య సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story