Amadalavalasa: శ్రీకాకుళంలో యూరియా కోసం మహిళా రైతు మృతి వైఎస్ఆర్సీపీ ఫైర్
Amadalavalasa: శ్రీకాకుళం జిల్లా నందిగామలో యూరియా కోసం మహిళా రైతు మృతి చెందడం ప్రభుత్వ హత్యేనని ఆమదాలవలస వైఎస్ఆర్సీపీ ఇంచార్జ్ చింతాడ రవికుమార్ ఆరోపించారు.
Amadalavalasa: శ్రీకాకుళంలో యూరియా కోసం మహిళా రైతు మృతి వైఎస్ఆర్సీపీ ఫైర్
ఆమదాలవలస: శ్రీకాకుళం జిల్లాలో నందిగామ మండలంలో యూరియా కోసం ఓ మహిళ చనిపోవడం దారుణం అంటూ ఆమదాలవలస నియోజకవర్గం వైసిపి సమన్వయకర్త చింతాడ రవికుమార్ అన్నారు.
తన పార్టీకార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ శ్రీకాకుళం జిల్లా టెక్కలి నియోజకవర్గం స్వయాన వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చన్న నాయుడు ప్రాతనిధ్యం వహిస్తున్న నందిగామ మండలంలో యూరియా కోసం వరుసలో నిలుచొని, అధికారుల వేధింపులు తట్టుకోలేక, ఒక మహిళ రైతు తననిండు ప్రాణాలని విడిచిపెట్టింది. ఇది ముమ్మాటికి ప్రభుత్వ హత్య అని చింతాడ రవికుమార్ వ్యాఖ్యానించారు.
భారతదేశం లో ఉన్న ప్రజలు45% వ్యవసాయ రంగం మీద ఉపాధి మీద ఆధారపడి ఉంటే, చంద్రబాబు నాయుడు మాత్రం వ్యవసాయం దండగని ఎరువులు ఎక్కువగా వాడటం వలన క్యాన్సర్ వస్తుందని చెబుతున్న చంద్రబాబునాయుడు, పురుగుల మందులు వాడితే క్యాన్సర్ రాద అని రవికుమార్ ప్రశ్నించారు . చిన్న సన్నకారు రైతులకు ఒక యూరియా బస్తా ఇవ్వకుండా, యాప్ల తో, ఓటీపీలతో, రైతులను అయోమయంగా గురిచేసి ,, యూరియా బస్తా కావాలంటే పురుగుల మందు కొనండి, రైతుల మీద ఒత్తిడి తెచ్చి కొనిపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.




