Kanchili: గొల్లపుట్టుగలో వైఎస్సార్‌సీపీ ఇంటింటి ప్రచారం!

Kanchili: కంచిలి మండలం గొల్లపుట్టుగలో ఎమ్మెల్సీ నర్తు రామారావు, శ్యాం ప్రసాద్ రెడ్డి ఇంటింటి ప్రచారం. పెద్దకొజ్జిరి నుండి టీడీపీ నేత మేఘనాధం వైఎస్సార్‌సీపీలో చేరిక.

G.RAMBABU, SOMPET
Published on: 26 Oct 2026 11:11 PM IST
Kanchili
X

Kanchili: గొల్లపుట్టుగలో వైఎస్సార్‌సీపీ ఇంటింటి ప్రచారం!

కంచిలి: కంచిలి మండలం జాడుపుడి పంచాయతీ పరిధిలోని గొల్లపుట్టుగ గ్రామంలో వైసీపీ నాయకులు సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ నర్తు రామారావు, ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త సాడి శ్యాం ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో ఓటర్లను కలుసుకుని, స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. గత ప్రభుత్వానికి, ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాలను వివరించారు.

ఇదిలా ఉండగా, కంచిలి మండలం పెద్దకొజ్జిరి గ్రామానికి చెందిన బొడ్డ మేఘనాధం టీడీపీ నుంచి వైసీపీలో చేరారు. నర్తు రామారావు, సాడి శ్యాం ప్రసాద్ రెడ్డి ఆయనకు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు.

ప్రచారంలో వైసీపీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి నర్తు నరేంద్ర, మాజీ ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, జడ్పీటీసీ అభ్యర్థి ఇప్పిలి కృష్ణారావు, ఎంపీపీ అభ్యర్థి పైల హిమావతి, ఎంపీటీసీ అభ్యర్థి నీలాంబర్ రెడ్డి, మాజీ సర్పంచులు పలికల జయరాం, పొందల ఢిల్లీ రావు, పలికల జయ, మాజీ పీఏసీఎస్‌ చైర్మన్‌ దుర్గాసి ధర్మారావు, మడ్డు వెంకటరావు, రంగాల శ్రీనివాస్, యుగంధర్, మెండ ప్రకాశ్, పిలక సోమేశ్వరరావు, రాజు, జగదీష్ గ్రామ పెద్దలు, నాయకులు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET