Kanchili: కంచిలిలో అమ్మవారి సందడి.. ప్రత్యేక పూజల్లో సాడి శ్యాంప్రసాద్ రెడ్డి!
Kanchili: కంచిలి గ్రామ దేవత శ్రీ కంచమ్మ తల్లి వార్షిక మహోత్సవాల్లో పాల్గొన్న ఇచ్ఛాపురం వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి సాడి శ్యాంప్రసాద్ రెడ్డి.
Kanchili: కంచిలిలో అమ్మవారి సందడి.. ప్రత్యేక పూజల్లో సాడి శ్యాంప్రసాద్ రెడ్డి!
Kanchili: కంచిలి గ్రామ దేవత శ్రీ కంచమ్మ తల్లి వార్షిక మహోత్సవాలు మంగళవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఇచ్ఛాపురం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇంఛార్జి సాడి శ్యాంప్రసాద్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. భవానీ దీక్ష స్వాములు, మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ‘అమ్మవారి ఆశీస్సులతో నియోజకవర్గంలో ప్రతి ఇంటా సుఖసంతోషాలు వెల్లివిరియాలి. రైతులు, మత్స్యకారుల కష్టాలు తీరాలి’ అని ఇంఛార్జి శ్యాంప్రసాద్ రెడ్డి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కంచిలి మండల ప్రజా పరిషత్ అధ్యక్షుడు పైల దేవదాస్ రెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎన్. బాబురావు, మండల వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి మడ్డు వెంకటరావు, ఎస్సార్సీపురం మాజీ సర్పంచ్ ప్రతినిధి డొక్కర బలరాం, చల్లా దేవరాజు, వంకల దుర్యోధన, కొల్లి చందనకిశోర్ యాదవ్ పాల్గొన్నారు.




