Ichchapuram: బూత్ స్థాయి నుంచి వైఎస్సార్సీపీ బలోపేతం!

Ichchapuram: ఇచ్చాపురం నియోజకవర్గం, కంచిలి మండలం ఎం.ఎస్. పల్లిలో వైఎస్సార్సీపీ కార్యకర్తల సమావేశం జరిగింది.

G.RAMBABU, SOMPET
Published on: 25 April 2026 7:17 AM IST
Ichchapuram
X

Ichchapuram: బూత్ స్థాయి నుంచి వైఎస్సార్సీపీ బలోపేతం!

Ichchapuram: ఇచ్చాపురం నియోజకవర్గ వైస్సార్సీపీ సమన్వయకర్త సాడి శ్యాంప్రసాద్ రెడ్డి శుక్రవారం కంచిలి మండలం ఎం.ఎస్ పల్లి పంచాయతీలో పార్టీ నాయకులు, కార్యకర్తలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా సాడి శ్యాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ కమిటీలను మరింత బలోపేతం చేయాల్సిన అవసరాన్ని వివరించారు. వన్ టైం కన్ఫర్మేషన్ ప్రక్రియను కచ్చితంగా అమలు చేయాలని, బూత్ స్థాయి వరకు పార్టీ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని ఆయన సూచించారు. ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ ఐ ఆర్)లో బూత్ లెవల్ ఏజెంట్ల (బిఎల్ఏ) పాత్ర కీలకమని పేర్కొంటూ, వాస్తవ ఓటర్లను పరిరక్షించడంలో ప్రతి కార్యకర్త బాధ్యతగా వ్యవహరించాలని ఆయన తెలిపారు.

అనంతరం వైఎస్సార్సీపీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి నర్తు నరేంద్ర మాట్లాడుతూ గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతానికి సమిష్టి కృషి అవసరమని తెలిపారు. బూత్ స్థాయిలో మరింత సమన్వయంతో పనిచేస్తేనే పార్టీ మరింత బలపడుతుందని ఆయన పేర్కొన్నారు. కార్యకర్తలు క్షేత్రస్థాయిలో చురుకుగా ఉండాలని ఆయన సూచించారు.

తరువాత ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో పార్టీ కార్యక్రమాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజలతో నేరుగా సంబంధాలు పెంచుకొని, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని ఆయన సూచించారు. రాబోయే ఎన్నికలకు బూత్ స్థాయిలో బలమైన వ్యవస్థను సిద్ధం చేయాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కొనపల సురేష్, సాలిన గాంధీ, గణప సింహాచలం, బుడ్డెపు విశ్వనాధ్, బుడ్డెపు ఆనంద్, బిశ్వనాధ్, మాదాలు, బదకల ఢిల్లీరావు తదితరులు పాల్గొన్నారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story