Kanchili: కంచిలిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ

Kanchili: కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తయినా హామీలు నెరవేర్చలేదని ఎంపీపీ పైల దేవదాస్ రెడ్డి, వజ్జ మృత్యుంజయ రావు ఆధ్వర్యంలో మానవహారం.

G.RAMBABU, SOMPET
Published on: 4 Jun 2026 3:32 PM IST
Kanchili
X

Kanchili: కంచిలిలో వైఎస్సార్‌సీపీ భారీ నిరసన ర్యాలీ

కంచిలి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో విఫలమైందని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గురువారం కంచిలి మండల కేంద్రంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. “వెన్నుపోటుకు రెండేళ్లు” పేరుతో చేపట్టిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత, పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

కంచిలి మండల పరిషత్ అధ్యక్షుడు (ఎంపీపీ) పైల దేవదాస్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ మండల పార్టీ అధ్యక్షుడు వజ్జ మృత్యుంజయ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీ కంచిలి స్టేట్ బ్యాంక్ కూడలి వద్ద ప్రారంభమై ప్రధాన రహదారుల గుండా రైల్వే స్టేషన్ ఆవరణలోని మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వరకు కొనసాగింది. ర్యాలీ సందర్భంగా పార్టీ శ్రేణులు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. అనంతరం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద మానవహారం నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు.

G.RAMBABU, SOMPET

G.RAMBABU, SOMPET

Next Story