Palasa: మద్యం ఫుల్.. పెట్రోల్ నిల్.. కూటమిపై మాజీ మంత్రి ఫైర్
Palasa: ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ కొరతపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది.
Palasa: మద్యం ఫుల్.. పెట్రోల్ నిల్.. కూటమిపై మాజీ మంత్రి ఫైర్
Palasa: అసమర్ధ చంద్రబాబు కూటమి పాలనలో గత 4,5 రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ లో డీజల్, పెట్రోల్ కొరత కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పతున్నారు. ఇంధనం కొరత ఏర్పడుతుందని ప్రభుత్వం దగ్గర ముందస్తు సమాచారం ఉన్న ఇంధనం కొరత నివారణకు ఎటువంటి ఏర్పాట్లు చేయకుండా కాలయాపన చేశారు ప్రభుత్వం డీజల్, పెట్రోల్ కొరత లేదని చెబుతుంది కానీ రాష్ట్రవ్యాప్తంగా చాలా బంకులో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి.
డీజల్, పెట్రోల్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే ప్రజలకు అందుబాటులో ఉండవలసిన పాలకులు టూర్లలో బిజీగా ఉన్నారు. ప్రజల ఇబ్బందులను గమనించిన వైస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజల తరువున ప్రభుత్వాన్ని నిలదీయడం కోసం ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకులు వద్ద వైస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో భాగంగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ సిదిరి అప్పలరాజు గారు ఆధ్వర్యంలో పలాస నియోజకవర్గం,మందస మండలం, హరిపురం జాతీయ రహదారి ప్రక్కన ఉన్న పెట్రోల్ బంకు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది.
ఈకార్యక్రమంలో నియోజకవర్గం వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులు ఎన్ని.ధనుంజయ గారు పలాస నియోజకవర్గం వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాష్ట్ర పార్టీ నాయకులు, జిల్లా పార్టీ నాయకులు, మండల, పట్టణ పార్టీ నాయకులు, వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపిలు, జడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, మాజీ మునివిపల్ కౌన్సిలర్లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.




